Heroine Personal Life : సినీరంగం అంటే చాలా మందికి గ్లామర్, పేరు, డబ్బు గుర్తుకొస్తాయి. కానీ ఆ రంగంలో ఉన్న హీరోయిన్లు, హీరోలు కూడా సాధారణ మనుషుల్లాగే కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఎవరికైనా మంచి ప్రేమ, మంచి కుటుంబం దొరుకుతుంది. మరికొందరికి మాత్రం ప్రేమలో బాధలు తప్పవు. అలాంటి పరిస్థితినే ఇప్పుడు నైనా గంగూలీ ఎదుర్కొంటున్నారు.
1/6నైనా గంగూలీ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన అమ్మాయి. చదువులు పూర్తయ్యాక ముంబైకి వెళ్లి మోడలింగ్ మొదలు పెట్టారు. అక్కడ కొన్ని పెద్ద బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల్లో నటించారు. ఆ తరువాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన "వంగవీటి" అనే సినిమాలో రత్నకుమారి పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో ఆమె నటన, లుక్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి.
2/6ఆ తరువాత "జోహార్", "మళ్లీ మొదలైంది", "డేంజరస్", "తగ్గేదేలే" వంటి సినిమాల్లో కనిపించారు. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2024లో కన్నడలో "ప్రణయం" సినిమా చేసిన తరువాత, కొత్త సినిమాలు ఆమెకు రాలేదు. అందుకే ఓటీటీలో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించారు. కానీ అక్కడ కూడా ఎక్కువ అవకాశాలు లభించలేదు.
3/6తాజాగా నైనా గంగూలీ తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన ప్రియుడి గురించి చెప్పిన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. కోల్‌కతాకు చెందిన ఒక కొరియోగ్రాఫర్‌తో రిలేషన్‌లో ఉన్నానని, మొదట్లో ఆ ప్రేమ బాగానే సాగిందని చెప్పారు. కానీ తరువాత అతని అసలు స్వభావం బయటపడిందని తెలిపారు.
4/6ఆమె మాట్లాడుతూ.. "ప్రతిరోజూ అతని చేతుల్లో శారీరకంగా, మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నా. అదొక్కటే కాదు, ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ప్రేమించాను.. అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను" అని చెప్పింది. తన ప్రియుడు ఎవరో త్వరలో చెబుతానని కూడా స్పష్టంచేశారు.
5/6ఈ పోస్ట్ బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. నైనాకు ధైర్యంగా ఉండమని కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆ కొరియోగ్రాఫర్ పేరు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నైనా గంగూలీకి ఒక ప్రత్యేకత ఏమిటంటే .. తన మనసులో ఉన్నది నేరుగా చెప్పేస్తుంది. ఎలాంటి భయం లేకుండా తన ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకుంటుంది. అమ్మాయిలు ఎవరూ తమ కలల కోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, అదే నిజమైన మహిళా సాధికారత అని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు.
6/6ప్రస్తుతం నైనా గంగూలీకి సినిమాలు, వెబ్ సిరీస్‌లు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ ఘటన తర్వాత ఆమె భవిష్యత్తులో ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి.సినిమా గ్లామర్ వెనుక కూడా ఇలాంటి కఠినమైన అనుభవాలు ఉంటాయని, నైనా గంగూలీ మాటలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.