Add Zee Business As A Preferred Source
App

Actress: తెలుగు స్టార్ హీరోయిన్ కొట్టిన దెబ్బ వల్ల నాలుగు సంవత్సరాలు బాధ అనుభవించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఏం చెప్పారంటే

Written ByVishnupriya
Published: Jan 08, 2026, 10:54 PM IST|Updated: Jan 08, 2026, 10:54 PM IST

Star Herione: తెలుగు సినిమా పరిశ్రమలో బాలనటిగా అడుగుపెట్టి, తరువాత హీరోయిన్‌గా..ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి వై. విజయ. దాదాపు రెండు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగుతూ వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. తన సహజ నటన.. సాదాసీదా అభినయంతో అనేక పాత్రలకు ప్రాణం పోశారు.
 

Telugu Star Herione1/5

నటి వై విజయ

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వై. విజయ.. తన సినీ ప్రయాణం గురించి.. చిన్న వయసులో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కేవలం 13 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చానని ఆమె గుర్తు చేసుకున్నారు. 

Y Vijaya Interview2/5

నటి వై విజయ

అసలు సినిమాల్లో నటించాలనే.. ఆలోచన లేకుండా.. కేవలం నాట్యం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే కడప నుంచి చెన్నైకి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ ప్రసిద్ధ నాట్య గురువు వెంపటి చిన్న సత్యం వద్ద శిక్షణ తీసుకున్న సమయంలోనే..అనుకోకుండా సినీ అవకాశాలు వచ్చాయని తెలిపారు.  

Star Heroine Interview3/5

నటి వై విజయ

తన కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశం దక్కిందని వై. విజయ చెప్పారు. ముఖ్యంగా తల్లిదండ్రులు సినిమా.. తన జీవితాన్ని మలుపు తిప్పిందని అన్నారు. ఇక తన.. షూటింగ్‌లకు తల్లి తప్పకుండా వెంట వచ్చేవారని చెప్పారు.

Y Vijaya4/5

నటి వై విజయ

ఈ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర సంఘటనను కూడా వై. విజయ పంచుకున్నారు. అదే తల్లిదండ్రులు సినిమాలో మహానటి సావిత్రి గారితో.. కలిసి నటించిన  సన్నివేశంలో సావిత్రి గారు తనను కొట్టాల్సి ఉండటంతో..ముందే జాగ్రత్త..అంటూ హెచ్చరించారని తెలిపారు.   

Savithri 5/5

నటి వై విజయ

కానీ ఆ సన్నివేశంలో పాత్రలో పూర్తిగా లీనమైన సావిత్రి గారు నిజంగానే కొట్టడంతో..తనకు చెవి వద్ద గాయం అయ్యిందని..ఆ నొప్పి 4 ఏళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. అయితే..ఇది సావిత్రి గారి నటన పట్ల ఉన్న అంకితభావాన్ని చూపిస్తుందని వై. విజయ పేర్కొన్నారు.