Bollywood Star Heroine: బాలీవుడ్ అదో డ్రీమ్ వరల్డ్. ఈ ఇండస్ట్రీలోకి చాలా మంది డబ్బు, పేరు కోసమే వస్తుంటారు. కానీ ఈమె మాత్రం వేల కోట్ల ఆస్తులున్నా.. సినిమాపై మక్కువతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 90లలో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. అంతేకాదు డజనుకు పైగా ఎఫైర్స్.. మ్యారేజ్ చేసుకున్న రెండేళ్లకే భర్తతో విడాకులు తీసుకుంది ఈ భామ.
1/6Bollywood Star Heroine: బాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్స్ తమ సినిమాలతో కాకుండా వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వాళ్లలో హీరోయిన్ మనీషా కొయిరాల ఒకరు. నేపాల్ రాజ కుటుంబానికి చెందిన ఈమెకు అప్పటికే వేల కోట్లకు పైగా ఆస్తిపాస్తులున్నాయి.
2/6మనీషా కొయిరాల..1991లో సుభాష్ ఘాయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘సౌదాఘర్’ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీలోనే తన యాక్టింగ్ తో పాటు గ్లామర్ తో అప్పటి యూత్ ను ఆకట్టుకుంది. అంతేకాదు బాలీవుడ్ లో అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
3/6మనీషా కొయిరాల సినీ రంగంలో అగ్ర కథానాయికగా ఈమె కెరీర్ సాగినా..పర్సనల్ లైఫ్ మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది. 1970లో నేపాల్ రాజకీయ కుటుంబంలో జన్మించిన ఈ నటి తాత బ్రిజేశ్వర్ ప్రసాద్ కొయిరాల ప్రైమ్ మినిష్టర్ గా పనిచేశారు. అంతేకాదు వాళ్ల ఫ్యామిలికి చెందిన పలువురు ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
4/61991లో విడుదలైన ‘సౌదాగర్’ చిత్రం తర్వాత వెనుదిగిరి చూసుకోలేదు. తెలుగులో కూడా నాగార్జున సరసన ‘క్రిమినల్’ చిత్రంలో నటించింది. అటు సౌత్ లో‘బాంబే’, భారతీయుడు ఒకే ఒక్కడు, బాబా మూవీల్లో నటించి ఇక్కడ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చిత్ర పరిశ్రమలో లవ్ ఎఫైర్స్, విడిపోవడం, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్. అదే మనీషా కొయిరాల విషయంలో జరిగింది. హీరోయిన్స్ గా పీక్స్ లో ఉన్న సమయంలోనే మనీషా కొయిరాలా ఒకేసారి 12 మందిపైగా డేటింగ్ చేసింది. ఈ బ్యూటీ తన 30 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 70 సినిమాల్లో కథానాయికగా నటించింది.
5/6ముఖ్యంగా మణిరత్నం డైరెక్షన్ లో నటించిన ‘బాంబే’ చిత్రంతో ప్యాన్ ఇండియా లెవల్లో అప్పట్లోనే సత్తా చాటింది మనీషా. సినిమాల్లో సక్సెస్ సాధించిన మనీషా కొయిరాల రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. అప్పట్లో ఈమె హీరో వివేక్ ముష్రాన్, నానా పాటేకర్, వ్యాపారవేత్త సిసిల్ ఆంటోని సహా ఎంతో మందితో ఎఫైర్ నడిపించిందనే కొన్ని పత్రికలు రాసాయి.
6/62010లో, మనీషా కొయిరాలా ప్రముఖ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. కొంత కాలం సాఫీగా సాగిన వీరి సంసారంపై ఎవరి కన్నుపడిందో వీళ్లిద్దరు కొన్నిపర్సనల్ ఈగోస్ వల్ల తన భర్తకు రెండేళ్లకే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం మనీషా ఒంటరిగా లైఫ్ ను లీడ్ చేస్తోంది. 55 యేళ్ల ఈ హీరోయిన్.. ఇపుడు రెండో పెళ్లికి సిద్దమైనట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది.