Star Anchor Shiva Jyothi Consived: పెళ్లయి దశాబ్దం దాటినా సంతానం లేక ఇబ్బందులు పడుతున్న స్టార్ యాంకర్ శివజ్యోతి ఎట్టకేలకు గర్భం దాల్చింది. తన పూజలు, వత్రాలు ఫలించి తాను గర్భవతి కావడంతో ఉబ్బితబ్బిబవుతోంది. దసరా పండుగ రోజు శుభవార్త ప్రకటించింది.
1/6తెలుగు వినోద రంగంతోపాటు జర్నలిజంలో గుర్తింపు పొందిన యాంకర్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి పూజలు, వ్రతాలు ఫలించాయి. పెళ్లయి దశాబ్దం దాటినా సంతానం లేక ఇబ్బందులు పడుతుండగా ఎట్టకేలకు దేవుడు కరుణించాడు. వారికి పండంటి బిడ్డ పుట్టబోతున్నది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2/6ఓ న్యూస్ ఛానల్‌లో సావిత్రక్కగా వెలుగులోకి వచ్చిన శివజ్యోతి తాను ప్రేమించిన గంగూలీని వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుని దశాబ్దం గడిచినా గంగూలీ, శివజ్యోతి దంపతులకు పిల్లలు కలగలేదు. సంతానం కోసం ఆమె ఎక్కని కొండ లేదు.. చేయని పూజ లేదు. చివరికి ఆమె వ్రతాలు, పూజలు ఫలించి ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నది.
3/6అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ శుభవార్త ప్రకటించింది. భర్త గంగూలీతో కలిసి సావిత్రి తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు చెప్పారు. 'ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతో ఎదురుచూశారు' అని సావిత్రి తెలిపింది.
4/6'బిడ్డ వస్తుందని చెప్పగానే మా వాళ్లు ఇచ్చిన భావాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. దిష్టి కన్నా మీ బలమైన ఆశీర్వాదం గట్టిదని నిరూపిద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మద్దతునిచ్చినవాళ్లను జీవితాంతం మర్చిపోను' అని శివజ్యోతి ప్రకటించింది. అయితే పిల్లలు లేనివారిని అని బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోనని యాంకర్ శివజ్యోతి తెలిపింది.
5/6తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి అలియాస్ సావిత్రక్కగా గుర్తింపు పొందారు. పలు ఛానల్స్‌లలో యాంకర్‌గా పనిచేసిన యాంకర్ శివజ్యోతి బుల్లితెరపై మెరుస్తున్నారు.
సావిత్రి భర్త గంగులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన సావిత్రి.. అనంతరం టీవీ షోలలో మెరుస్తూ ప్రేక్షకులకు వినోదం అందిస్తోంది. ప్రస్తుతం శివజ్యోతి యూట్యూబర్‌గా రాణిస్తున్నారు.