Strongest Currency in the World: ప్రపంచంలో మనందరం అమెరికా డాలర్ కు ఎక్కువ వాల్యూ ఉందని అనుకుంటాము. ఇక మన దేశం ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు అమెరికా వెళ్లడానికి ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ దేశ కరెన్సీ ఫుల్ స్ట్రాంగ్. కానీ అమెరికాను తలదన్నేలా ఉంది ఈ దేశ కరెన్సా వాల్యూ. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా..
Jordanian Dinar: జోర్డాన్ ముస్లిం దేశ కరెన్సీ వాల్యూ ప్రపంచ దేశాల్లో అన్నిటి కన్నా టాప్ లో ఉంది. ఇక్కడి 8000 దీనార్లు సంపాదించి మీరు మన దేశానికి తీసుకువస్తే ఏకంగా మిలియనీర్ అవుతారు. అంటే అక్కడ 800 మన దేశంలో రూ. 1.14 లక్షలకు సమానం. జోర్డాన్ దినార్ ఇది ప్రపంచంలోని బలమైన కరెన్సీలలో ఒకటి. భారతదేశానికి వచ్చిన తర్వాత 800 JOD జోర్డాన్ దీనార్స్ సంపాదించడం అంటే మన దేశంలో సుమారు ₹1.14 లక్షలకు సమానం. ఈ దేశ కరెన్సీ ఎందుకు అంత స్థిరంగా విలువైనదిగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం..
అనేక దేశాల కరెన్సీలు భారత రూపాయి కంటే చాలా బలంగా ఉన్నాయి...ప్రపంచంలో అనేక దేశాల కరెన్సీలు భారత రూపాయి కంటే ఎక్కువ వాల్యూ ఉన్నాయి. ఈ జాబితాలో కువైట్ దినార్, బహ్రెయిన్ దినార్, US డాలర్, బ్రిటిష్ పౌండ్ , యూరో కూడా ఉంది. భారత రూపాయి కంటే కరెన్సీ చాలా బలంగా ఉన్న వాటిలో జోర్డాన్ కూడా ఉంది.ఒక జోర్డాన్ దినార్ ఎన్ని భారతీయ రూపాయలకు సమానమనే విషయానికొస్తే.. జోర్డాన్‌లో దాదాపు 11.2 మిలియన్ల జనాభా ఉంది, దాని కరెన్సీ అయిన జోర్డాన్ దినార్ (JOD), భారత రూపాయితో పోలిస్తే చాలా విలువైనది. Vice.com నివేదిక ప్రకారం, 1 జోర్డాన్ దినార్ విలువ మన దేశంలో సుమారు ₹126.8 లతో సమానం. అదే సమయంలో, 1 భారతీయ రూపాయి జోర్డాన్‌లో కేవలం 0.00788 జోర్డాన్ దినార్‌లకు సమానం.
జోర్డాన్ లో సంపాదించి భారతదేశానికి తిరిగి వెళితే ఏకంగా లక్షాధికారి కావచ్చు.. ఒక భారతీయుడు జోర్డాన్‌లో కేవలం 800 జోర్డాన్ దినార్‌లను సంపాదిస్తే, మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత వాటి విలువ సుమారు ₹1,14,000 ఉంటుంది. జోర్డాన్ దినార్ అంతర్జాతీయంగా నాల్గవ అత్యధిక విలువ కలిగిన కరెన్సీగా చెలామణి అవుతుంది.
ప్రపంచంలో కువైట్ దినార్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత బహ్రెయిన్ దినార్ 2వ స్థానంలో ఉంది. 3వ ప్లేస్ లో ఒమానీ రియాల్ ఉంది. ఆ తర్వాత జోర్డాన్ దినార్ వాల్యూ 4వ స్థానంలో కొనసాగుతుంది. అందుకే JOD(జోర్డాన్ దినార్) వాల్యూ ప్రపంచంలోని అత్యంత స్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ కరెన్సీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
జోర్డాన్ దినార్ ఎందుకు అంత బలంగా ఉందనే విషయానికొస్తే.. చమురు సంపన్న దేశాలైన ఒపెక్ కంట్రీస్ మాత్రమే బలమైన కరెన్సీలు ఉన్నాయి. కానీ జోర్డాన్ దీనికి మినహాయింపు. జోర్డాన్‌లో పెద్ద చమురు నిల్వలు లేవు. అయినప్పటికీ దాని కరెన్సీ మాత్రం స్థిరంగా కొనసాగుతూనే ఉంది. ఈ దేశం ప్రధానంగా దాని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ద్రవ్య వినిమయ విధానం కారణంగా ఉంది. జోర్డాన్ US డాలర్‌కు అనుసంధానించబడటంతో స్థిరమైన కరెన్సీగా కొనసాగుతూనే ఉంది.
కరెన్సీ సరఫరా పరిమితంగా ఉంటుంది. ఈ దేశ స్థిరత్వం వెనక కరెన్సీపై ప్రభావం కూడా ఉంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఈ దేశం స్వర్గధామంగా ఉంది. ఇంకా, జోర్డాన్ కేంద్ర బ్యాంకు దాని ద్రవ్య విధానాలలో అధిక నియంత్రణ కలిగి ఉంటుంది. క్రమశిక్షణ కలిగి ఉంటుంది. కరెన్సీ సరఫరా పరిమితంగా ఉంటుంది. కాలక్రమేణా JOD విలువ పడిపోకుండా అలాగే నిరోధించడంలో అక్కడ కేంద్ర బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జోర్డాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో మన దేశంతో పోలిస్తే చాలా చిన్నది. కానీ దాని వ్యవస్థీకృత, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా, దాని కరెన్సీ స్థిరంగా కొనసాగుతూనే ఉంది.
జోర్డాన్ దినార్‌తో పోలిస్తే రూపాయి ఎందుకు బలహీనంగా ఉందనే విషయానికొస్తే.. భారత రూపాయి జోర్డాన్ దినార్ కంటే బలహీనంగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం, చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ స్థిరత్వం వంటి అనేక అంశాల ద్వారా దాని రేట్లు అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉన్నాయి. అందుకే భారత రూపాయి తరచుగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. సాపేక్షంగా బలహీనంగా ఉంది.
జోర్డాన్ దినార్ నియంత్రణ.. జోర్డాన్ సెంట్రల్ బ్యాంక్ జోర్డాన్‌లోని మొత్తం కరెన్సీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇది నోట్లను జారీ చేస్తుంది. నాణేల సరఫరాను నియంత్రిస్తూ ఉంటుంది. ద్రవ్య విధానాలను రూపకల్పన చేస్తోంది. 1964లో బ్యాంక్ స్థాపించబడినప్పటి నుండి, జోర్డాన్ స్థిరంగా బలమైన, స్థిరమైన కరెన్సీని నిర్వహిస్తూ వస్తోంది.
జోర్డాన్ నోట్స్, నాణేలు.. జోర్డాన్‌లో చెలామణిలో ఉన్న అన్ని నోట్స్, నాణేలు అక్కడి సెంట్రల్ బ్యాంక్ జారీ చేస్తాయి. ఈ నియంత్రణ జోర్డాన్ దినార్‌ను అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి రక్షిస్తుంది. అంతేకాదు ప్రపంచంలోని అత్యంత స్థిరమైన కరెన్సీలలో ఒకటిగా నిర్వహిస్తుంది.