Three Days Holidays To Govt Employees In Adilabad District: వరుస పండుగలు.. ప్రకృతి వైపరీత్యాలు.. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా సెప్టెంబర్ నెలలో భారీగా సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే రెండు వారాల్లో భారీ సెలవులు రాగా.. తాజాగా అకస్మాత్తుగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/5ఉన్నఫళంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు లభించింది. అకస్మాత్తుగా సెలవు లభించడంతో ప్రభుత్వ ఉద్యోగులు అవాక్కు చెందారు. తీరా ఈ ఒక్క సెలవుతో వరుసగా మూడు రోజులు కలిసి రానుండడంతో పండుగ చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2/5తెలంగాణలోని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఉద్యోగులకు ప్రభుత్వం అకస్మాత్తుగా సెలవు ప్రకటించింది. ఉద్యోగానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగులకు ఉదయమే ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు.
3/5ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం భవనం పైకప్పు గురువారం కూలిపోయింది. పురాతన భవనం కావడంతో కూలింది. అయితే కూలిన సమయంలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాల సమయంలో భవనం మరింత పడిపోయే ప్రమాదం ఉండడంతో శుక్రవారం సెలవు ఇచ్చారు.
4/5ఈ మేరకు కలెక్టరేట్ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రకటన చేశారు. భవనం శిథిలమైనందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో తాత్కాలికంగా మూతపడ్డ కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలు మూతపడ్డాయి.
5/5ఈ సెలవు కారణంగా ఉద్యోగులకు మూడు రోజులు సెలవు కలిసి రానున్నాయి. శుక్రవారం సెలవు ఇవ్వగా.. రెండో శనివారం కావడంతో ఎలాగో ఉంది. ఇక యథావిధిగా ఆదివారం అన్ని కార్యాలయాలకు సెలవు లభిస్తుంది. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులు పండుగ చేసుకోవచ్చు.