Suddenly Star Director K Raghavendra Rao Shaves Head: అకస్మాత్తుగా దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్ర రావు గుండు చేయించుకున్నారు. ఎప్పుడూ తెల్లటి గడ్డంతో ఆకర్షణీయంగా కనిపించే ఆయన గుండు చేయించుకోవడం విశేషం. గుండుతోపాటు గడ్డం, మీసాలు తీయడంతో ఆయనను గుర్తు పట్టడం కష్టంగా మారింది. ఇంతకీ ఎందుకు గుండు చేయించుకున్నారో తెలుసుకుందాం.
తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్ర రావు అకస్మాత్తుగా గుండుతో ప్రత్యక్షమయ్యారు. గుండుతోపాటు మీసం, గడ్డం లేకుండా ఆయన కనిపించడంతో ఎవరూ గుర్తుపట్టలేని పరిస్థితి. ఎవరైనా చూస్తే అతడిని రాఘవేంద్ర రావు అని గుర్తుపట్టారు. ఇంతకీ ఎందుకు గుండు చేయించుకున్నారో తెలుసుకుందాం.
తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక హిట్లు పొందిన దర్శకుడు కె రాఘవేంద్ర రావు గడ్డం, మీసాలతో నిండైన రూపంతో ఆకర్షణీయంగా ఉంటారు. అతడి గడ్డం చూసి రాఘవేంద్ర రావు అని గుర్తుపట్టారు. అలాంటిది గడ్డం, మీసం తీసేశారు.
మార్చి 23వ తేదీన రాఘవేంద్ర రావు జన్మదినం. తన బర్త్ డే సందర్భంగా తిరుమల శ్రీవారిని రాఘవేంద్ర రావు దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమలలో తలనీలాలు సమర్పించారు. దీంతో గడ్డం, మీసం తీసేసి కొత్త లుక్‌లో దర్శకేంద్రుడు కనిపించాడు.
తెల్ల గడ్డంతో కనిపించే రాఘవేంద్ర రావు గడ్డంతో లేకపోవడంతో తిరుమలలో భక్తులు ఆయనను గుర్తు పట్టలేకపోయారు. కాగా తిరుమలలో వెంట నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి స్వామిని దర్శించుకున్నారు. రాఘవేంద్ర రావుకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి. పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు రాఘవేంద్ర రావుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే రాఘవేంద్ర రావు మీద అభిమానంతో తన ఇంటి గుమ్మంలోనే అతడి ఫొటో పెట్టుకున్నారు. 'నా మొదటి దర్శకుడు' అని రాఘవేంద్ర రావు ఫొటో ఉంచారు. ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ రాఘవేంద్ర రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రిని రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.