Add Zee Business As A Preferred Source
App

Sudigali Sudheer: పెళ్లికి సిద్ధమైపోయిన సుడిగాలి సుదీర్.. అమ్మాయి ఎవరంటే..?

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Sep 23, 2025, 06:58 PM IST|Updated: Sep 23, 2025, 06:58 PM IST

Sudigali Sudheer Marriage : జబర్దస్త్ షో తో తనకంటూ ఎంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ సుడిగాలి సుదీర్. అప్పట్లో సుధీర్ తో పాటు శీను వేసే స్కిట్లు…జనాలకు బాగా రీచ్ అయ్యేవి. జబర్దస్త్ షోలో ఎన్నోసార్లు విన్నట్టుగా నిలిచారు సుధీర్.. ఇక ఆ తర్వాత యాంకర్ గా మారి ప్రస్తుతం గుండె ధరలో స్టార్ గా దూసుకుపోతున్నారు..

Sudigali Sudheer Wedding1/5

సుడిగాలి సుదీర్ ప్రస్తుతం బుల్లితెరలో యాంకర్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పటికే రెండు, మూడు సినిమాలు చేసి కొనసాగుతున్నారు. 

Sudigali Sudheer Personal Life 2/5

అయితే సుడిగాలి సుదీర్ ని మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన వయసు ప్రస్తుతం మూడు పదులు దాటి నాలుగుపదుల వయసుకి దగ్గరలో ఉంది. కానీ ఇప్పటివరకు పెళ్లి ప్రసక్తి మాత్రం ఎత్తలేదు. 

Sudigali Sudheer Bride 3/5

ఎన్నో సంవత్సరాల నుంచి సుధీర్ రష్మితో ప్రేమలో ఉన్నారు అన్న వార్త వినిపిస్తూనే వచ్చింది. వీళ్ళిద్దరూ బుల్లితెరపై కనిపించినప్పుడు కూడా అలానే ప్రవర్తించేవారు. అయితే  తమ ఇద్దరికీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ కూడా ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే గత కొద్ది రోజుల నుంచి సుధీర్ పెళ్లికి సిద్ధమయ్యారని.. విజయవాడ అమ్మాయి.. అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరోపక్క అసలు సుడిగాలి సుదీర్ కి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ..ఇది కేవలం పుకార్లే అన్న వార్త కూడా వినిపిస్తోంది.

Sudigali Sudheer Marriage Update 4/5

ఈ క్రమంలో తాజాగా.. జబర్దస్త్ పరిచయమైన మరో కమెడియన్ ధనరాజ్ భార్య శిరీష.. సుదీప్ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం బయట పెట్టింది. అసలు సుధీర్ కి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని చెబుతూ షాక్ ఇచ్చింది. 

Sudigali Sudheer Career5/5

పెళ్లి అంటే ఒక దగ్గర స్ట్రక్ అయిపోదాం అవుతుందని.. పెళ్లి చేసుకుంటే ఏమి చేయాలన్నా సాధ్యం కాదు అని.. ఈ మాటలు చెప్పే సుదీర్ తనకు పెళ్లి పైన ఇంట్రెస్ట్ లేదు అంటూ తమకు తెలిపారని చెప్పుకొచ్చింది. అయితే ఈ మాటలు ఏమీ అభిమానులు మాత్రం.. ఇదేమి పైత్యం ఇంత చిన్న కారణానికి పెళ్ళే వద్దనుకోవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు.