Sumalatha Ambareesh net worth: సుమలత అంబరీష్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలో పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి. ఆమె రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. సుమలత పుట్టింది చెన్నైలో 1963లో, కానీ ఆమె బాల్యం ముంబయి, ఆంధ్రప్రదేశ్‌లలో గడిచింది. 15 ఏళ్ల వయసులో ఆమె ఆంధ్రప్రదేశ్‌లో.. జరిగిన అందాల పోటీలో విజేతగా నిలిచారు.
సుమలత తన సినీ ప్రయాణాన్ని తమిళ, తెలుగు సినిమాలతో ప్రారంభించారు. కన్నడ పరిశ్రమలో అడుగు పెట్టిన తర్వాత రాజ్‌కుమార్ హీరోగా నటించిన "రవిచంద్ర" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటించిన 200కు పైగా సినిమాలు ఘన విజయం సాధించాయి.
సుమలత కన్నడ సినీ నటుడు అంబరీష్‌తో వివాహం చేసుకున్నారు. అంబరీష్‌ను ‘సాండల్‌వుడ్ కర్ణ’ అని అభిమానులు పిలుచుకునేవారు. వీరికి అభిషేక్ అనే కుమారుడు ఉన్నాడు. ఇటీవలే అభిషేక్, అవివా దంపతులకు ఓ కుమారుడు పుట్టడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
సుమలత అంబరీష్ కి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. లొక్‌సభ ఎన్నికల సమయంలో ఆమె ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం – - 17 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు - రూ. 41 లక్షల విలువైన వ్యవసాయ భూమి - బెంగళూరులో జయప్రకాశ్ నగర్‌లో ఇళ్లు, భవనాలు (రూ. 17.72 కోట్లు విలువైనవి) - రూ. 5.6 కోట్లు విలువైన చరాస్తులు - రూ. 12,70,363 బ్యాంక్ బ్యాలెన్స్ - రూ. 1.66 కోట్ల విలువైన బంగారం - రూ. 12.57 లక్షల విలువైన వెండి
సుమలత అంబరీష్ మొత్తం ఆస్తుల విలువ రూ. 23.4 కోట్లకు పైగా ఉంది. అయితే, వీటికి తోడు కొంత రుణ భారం కూడా ఉందని ఆమె వెల్లడించారు. సుమలత అంబరీష్ నటి మాత్రమే కాకుండా, రాజకీయం, వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.