Summer high temperature: కొన్నిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలుగా మారాయి. ప్రజలు కనీసం మార్చికి ముందే ఈసారి భానుడు మాడు పలగకొడుతున్నారు. బైటకు వెళ్లాలంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపంతో ప్రజలకు ఉక్కపోతకు గురిచేస్తున్నారు. కనీసం ఏప్రిల్ కు ముందే ప్రజలు బైటకు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉన్న వారు ఏసీలు, కూలర్ లు లేకుండా ఒక్కనిముషం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది.
చాలా చోట్ల ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలకు 40 డిగ్రీలను మించిపోతున్నాయి. మొత్తంగా ఎక్కడ చూస్తున్న భానుడి భగ భగలు కంటీన్యూ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉంటే.. ఫ్యూచర్ లో పరిస్థితి ఏంటని చాలా మంది ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపున పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, చెట్లను ఇష్టాను సారం నరికివేయడంవల్ల.. ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఎండలతో జనాలు తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండలలో బైటకు జనాలు వెళ్లేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఎండలలో తప్పినిసరిగాఅవసరమైతే మాత్రమే వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. బైటకు వెళ్లేవాళ్లు తప్పకుండా గొడుగును, టోపీలను, స్కార్ఫ్ ను తీసుకొని వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి గంటలకు కూడా నీళ్లు లేదా ఏదైన జ్యూస్ ను తాగుతు ఉండాలని చెబుతున్నారు. దాహం వేయట్లేదని శరీరంపై ఏ మాత్రం కూడా అశ్రద్ద చూంపిచకూడదని.. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఫ్రిజ్ లోని నీళ్ల కన్నా.. రంజన్ లోని నీళ్లు తాగాలని చెబుతున్నారు. ముఖ్యంగా సమ్మర్ లో స్పైసీ ఫుడ్ లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎండలలో బైటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తుల్ని మాత్రమే ధరించాలి. ఎక్కువగా చెమటలు తెప్పించే దుస్తుల్ని వేసుకొకూడదు. అదే విధంగా వేసుకున్న దుస్తుల్ని పదే పదే వేసుకొకూడదని కూడా చెబుతారు. ఎండలో బైటకు వెళ్లేటప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం, ఎలక్ట్రోల్ పౌడర్ లు తమతో తప్పకుండా ఉంచుకొవాలని చెబుతుంటారు.ఈ టిప్స్ పాటిస్తే సమ్మర్ హీట్ స్ట్రోక్ నుంచి బైటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.