Sun-Moon conjunction Effect On Zodiac: సూర్య చంద్ర గ్రహాల కలయిక కారణంగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయి. అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా జరిగిపోతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Sun-Moon conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాజుగా సూర్యుడిని పరిగణిస్తూ ఉంటారు. అందుకే సూర్యుడు ఎప్పుడు సంచారం చేసిన అన్ని రాశుల వారిపై ఒక ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఏప్రిల్ 27వ తేదీన ఒక యాదృచ్ఛికం ఏర్పడబోతోంది. ప్రస్తుతం సూర్యుడు మేషరాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే ఏప్రిల్ 27వ తేదీన చంద్రుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది.
చాలా రోజుల తర్వాత సూర్య, చంద్రుల సంయోగం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారు వారి జీవితాల్లో ఎన్నడూ పొందలేని మార్పులు చూస్తారు. అలాగే కొందరికి ఈ సమయంలో అదృష్టం సహకరించి విశేషమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
సూర్యచంద్ర గ్రహాల కలయిక కారణంగా మేష రాశి వారికి చాలా ఫలప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత పెరగడమే కాకుండా ఉద్యోగాలపరంగా వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే వ్యాపారాలపరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. డబ్బు సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
సింహరాశి వారికి కూడా చంద్ర సూర్య గ్రహణ కలయిక వల్ల ఎంతో మేలు జరుగుతుంది. తీవ్ర మానసిక సమస్యలు ఈ సమయంలో తొలగిపోతున్నాయి. వ్యాపారాలు చేసే వారికి కొత్త ప్రాజెక్టులు లభించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక సమాజంలో మంచి హోదా లభించి.. కీర్తి, ప్రతిష్టలు కూడా కలుగుతాయి. శత్రువులపై విజయాలు సాధించే అద్భుతమైన శక్తిని పొందగలుగుతారు.
కన్యా రాశి వారు సూర్యచంద్రుల కలయిక వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం ఎంతో మేలు జరుగుతుంది. వివాహాలు కాని వారికి వివాహ తేదీలు కూడా నిశ్చయమవుతాయి. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో కాస్త విముక్తి లభించబోతోంది. వ్యాపారాలు చేసుకునే వారు పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
ధనస్సు రాశి వారు కూడా సూర్యచంద్రుల కలయిక వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందగలిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కెరియర్ పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ప్రతి పనిలో విజయాలు సాధించడమే కాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆర్థికపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.