Blood Moon this Sunday: ఖగోళ శాస్త్ర ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అద్భుత దృశ్యం మరికొన్ని గంటల్లో కళ్ల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7న ఆకాశంలో అరుదైన చంద్రగ్రహణం జరగబోతోంది. ఆరోజు చంద్రుడు ప్యూర్ బ్లడ్ కలర్‌లో కళ్లకు కనువిందు చేయనున్నాడు.
1/5సెప్టెంబర్ 7న ఆకాశంలో అద్భుతమైన చంద్రగ్రహణం జరగబోతోంది. ఈ ఏడాది ఇది రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో రాత్రి 9:57 గంటల నుంచి తెల్లవారుజామున 1:26 వరకు కనిపించనుంది. ఈ గ్రహణం మూడు గంటల 29 నిమిషాల పాటు ఉంటుంది.
2/5ఈ సందర్భంగా ఆకాశంలో అద్భుతమైన బ్లడ్ మూన్ కనిపించనుంది. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలో ఉండడం వల్ల సాధారణం కంటే పెద్దగా.. మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఈ సమయంలో చంద్రుడు బంగారు ఎరుపు వర్ణంలో మెరుస్తాడు.
3/5ఈ చంద్ర గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, హిందూ మహాసముద్రం, అంటార్కిటికాలో కూడా కనిపించనుంది. ఇది చాలా అరుదైన ఖగోళ సంఘటన. ఈ గ్రహణం 82 నిమిషాల పాటు సంపూర్ణంగా కనిపిస్తుంది. ఇలాంటి గ్రహణం ఒక తరానికి ఒకసారి మాత్రమే వస్తుంది.
4/5చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందంటే సూర్యుడు, చంద్రుడి మధ్యలో భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీనివల్ల చంద్రుడు కొంత చీకటిగా లేదా పూర్తిగా చీకటిగా కనిపిస్తాడు. సంపూర్ణ చంద్రగ్రహణంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వస్తాడు. ఈ సమయంలో సూర్యకాంతి చంద్రుడిని నేరుగా చేరదు. భూమి వాతావరణంలో ఎరుపు, నారింజ రంగు కాంతి చంద్రుడిని చేరడం వల్ల అది బ్లడ్ మూ న్‌లా కనిపిస్తుంది.
5/5ఈ గ్రహణాన్ని చూడటానికి ఎటువంటి ప్రత్యేక కళ్లద్దాలు అవసరం లేదు. కానీ బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా చూడవచ్చు. ఈ గ్రహణం సమయం మీరు ఉన్న ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. సరైన సమయం తెలుసుకోవడానికి TimeAndDate.com లేదా NASA వెబ్‌సైట్‌లను చూడవచ్చు. ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని చూడటం మిస్ కాకండి.