Add Zee Business As A Preferred Source
App

Sunflower Seeds: రోజు ఒక స్పూను ఈ గింజలు తింటే కొలెస్ట్రాల్ నామరూపం లేకుండా పోతుంది..

Written ByRenuka Godugu
Published: Sep 14, 2025, 02:38 PM IST|Updated: Sep 14, 2025, 02:38 PM IST

Sunflower Seeds Benefits: పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇందులో మన శరీరానికి పోవాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్స్, ఖనిజాలు ,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ ఈ కూడా ఇందులో ఉంటుంది .పొద్దుతిరుగుడు విత్తనాలు ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
 

Healthy Fat1/5

ఆరోగ్యకరమైన కొవ్వులు

 పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి కాదు ..శరీర చర్మానికి కూడా మంచి గ్లో కూడా అందుతుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఫైబర్ ,ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి కొలెస్ట్రాలు స్థాయిలను తగ్గించేస్తాయి  

Healthy Heart2/5

గుండె ఆరోగ్యం

 పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పోలి అనుశాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించేస్తాయి. తద్వారా మీకు ఉండే కూడా ఆరోగ్యంగా ఉంటుంది.   

Digestion3/5

జీర్ఱ ఆరోగ్యం

 పొద్దుతిరుగుడు విత్తనాల వల్ల మీ జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో కరిగే, కరిగేని ఫైబర్ ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మరింత బలపరుస్తుంది. ఇవి ఎంతో ఆరోగ్య కరం.  

Sunflower Seeds4/5

పొద్దు తిరుగుడు విత్తనాలు

 రక్తంలో చక్కర స్థాయిలను కూడా అదుపులో చేస్తుంది. పొద్దుతిరుగుల విత్తనాలు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెల్లిగా కరుగుతుంది కాబట్టి మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగవు.  

Sunflower5/5

 పొద్దు తిరుగుడు

 పొద్దు తిరుగుడు విత్తనాలు విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు శరీరానికి కూడా మంచిది. చర్మ ఆరోగ్యాన్ని మరింత మెరుగు చేస్తుంది. మెరిసే ముఖం సొంతం అవుతుంది ఇందులో ఉంటాయి.