Central Govt Employees News: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో సూపర్ గుడ్‌న్యూస్.. ఇక నో టెన్షన్

Central Govt Employees Uniform Allowance: దసరా, దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు మోదీ సర్కారు ప్రకటించింది. దీంతో డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరిగింది. పెరిగిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. తాజాగా పోస్టల్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు కేంద్రం కీలక అప్‌డేట్ ఇచ్చింది. వివరాలు ఇలా..
 

1 /6

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు యూనిఫామ్ అలవెన్స్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. జూలై 1, 2025 తర్వాత చేరిన కొత్త ఉద్యోగులు కూడా ప్రయోజనం చేకూరేలా సవరించింది.  

2 /6

కొత్త నిబంధనల ప్రకారం.. సంవత్సరం మధ్యలో చేరే లేదా రిటైర్‌మెంట్ అయ్యే ఉద్యోగులకు ఇప్పుడు నిష్పత్తి ప్రాతిపదికన యూనిఫామ్ అలవెన్స్ అందజేయనుంది.   

3 /6

జూలై 2025 తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకు పాత 2020 నియమాలు అమలులో ఉంటుండగా.. కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన యూనిఫాం భత్యం అందించనున్నారు. అదేవిధంగా సంవత్సరం మధ్యలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు కూడా ప్రో-రాటా యూనిఫాం భత్యం చెల్లించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.   

4 /6

జూలై నెలకు సంబంధించిన జీతంతో దుస్తుల భత్యం చెల్లించినందున ఈ ఏడాది రిటైర్‌మెంట్ అయ్యే చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే భత్యంలో పూర్తి లేదా సగం పొందారని పోస్టల్ శాఖ తెలిపింది.   

5 /6

కొత్త నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 2025 తరువాత పదవీ విరమణ చేసే ఉద్యోగుల నుంచి అదనపు భత్యం మొత్తాన్ని వసూలు చేస్తారు. అయితే సెప్టెంబర్ 30, 2025 కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు.  

6 /6

జూలై 2025 కి ముందు సర్వీస్‌లో చేరిన ఉద్యోగులకు జూన్ 2025 వరకు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం యూనిఫామ్ అలవెన్స్ అందుతుంది. అయితే కొన్ని ప్రభుత్వ శాఖలలో గత సంవత్సరం దుస్తుల భత్యం జూలై 2025 జీతంలో చేర్చకపోవడంతో తాజాగా నిబంధనలు సవరించి ఉత్తర్వులు జారీ చేసింది.