Surekha Vani: 48 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న సురేఖ వాణి.. అఫీషియల్ గా చెప్పేసిన నటి..!

Surekha Vani Marriage : సురేఖ వాణి ఒకప్పుడు ఎన్నో తెలుగు సినిమాలు చేసి అందరిని ఆకట్టుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పద్ధతిగా కనిపిస్తూ.. కామెడీ కూడా బాగా పండించేది ఈ నటి. ముఖ్యంగా రెడీ లాంటి సినిమాలో.. చిట్టి నాయుడు సచ్చినోడా అనే డైలాగ్ తో తెగ పాపులర్ అయింది.. అయితే ఇప్పుడు సురేఖ వాణి అని పెళ్లికి సిద్ధమైందంట..
 

1 /5

ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి సురేఖ వాణి. అప్పట్లో ఎన్నో చిత్రాలలో కామెడీ కూడా బాగా పండించేది ఈ నటి. అయితే ఆ తరువాత సినిమాలు చేయడం కాస్త తగ్గిస్తూ వచ్చింది. 

2 /5

ఇక ఈ మధ్య సురేఖ వాణి ఎలాంటి సినిమాలలో కనిపించలేదు. కానీ సినిమాలలో ఎంతో పద్ధతిగా కనిపించిన సురేఖ వాణి.. ఇంస్టాగ్రామ్ లో మాత్రం రెచ్చిపోయి కనిపించి అందరిని మరింత ఆకట్టుకుంటూ వచ్చింది. 

3 /5

సురేఖ వాణి కూతురు సుప్రీతా కూడా.. సోషల్ మీడియాలో అందాల ఆరబోటతో పేరు తెచ్చుకొని ఇప్పుడు హీరోయిన్ గా కూడా మారింది. సుప్రీత పెళ్లి వయసుకు వచ్చిన తరుణంలో.. ఇప్పుడు సురేఖ వాణి పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.   

4 /5

సురేఖ వాణి భర్త చనిపోయి ఎన్నో రోజులు కావస్తోంది. ఇక ఇప్పుడు.. 48 ఏళ్ల వయసులో సురేఖ వాణి పెళ్లికి సిద్ధమవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా అఫీషియల్ గానే.. తనకు నచ్చే వ్యక్తి ఇలా ఉంటారు అంటూ.. చెప్పుకొచ్చింది సురేఖ వాణి. 

5 /5

ఈ తరుణంలో సురేఖ వాణి పెళ్లి వార్త నిజమే అవ్వచ్చు అని తెగ వినిపిస్తోంది. మరి సురేఖ వాణి రెండో పెళ్లి ఎవరిని చేసుకోబోతోంది అని తెలియాలి అంటే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.