Surya Kumar Yadav Donates Asia Cup Match Fee: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్ జట్టుపై విజయం తర్వాత.. తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన దాతృత్వంతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. టోర్నమెంట్ నుంచి తాను అందుకున్న మొత్తం మ్యాచ్ ఫీజును.. దేశ సైన్యానికి, పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించి నిజమైన నాయకుడనిపించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై అద్భుతమైన విజయం సాధించిన అనంతరం.. సూర్యకుమార్ ఈ ప్రకటన చేశాడు.
1/6దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో.. పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ తొమ్మిదవ సారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. తమ గెలుపు తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా.. ఓ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశాడు.
2/6కష్టపడి గెలిచిన తర్వాత ట్రోఫీని తిరస్కరించడం బాధగానే ఉంది.. కానీ మా అసలైన ట్రోఫీలు ఈ లోహపు షీల్డ్‌లో లేవు.. మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. మా జట్టులోని 14 మంది సహచరులు, సహాయక సిబ్బందే మాకు నిజమైన ట్రోఫీలు. ఈ విన్నింగ్ మూమెంట్, జ్ఞాపకాలు మాతోనే ఉంటాయన్నారు సూర్యకుమార్.
3/6కష్టపడి గెలిచిన తర్వాత ట్రోఫీని తిరస్కరించడం బాధగానే ఉంది.. కానీ మా అసలైన ట్రోఫీలు ఈ లోహపు షీల్డ్‌లో లేవు.. మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. మా జట్టులోని 14 మంది సహచరులు, సహాయక సిబ్బందే మాకు నిజమైన ట్రోఫీలు. ఈ విన్నింగ్ మూమెంట్, జ్ఞాపకాలు మాతోనే ఉంటాయన్నారు సూర్యకుమార్.
4/6గ్రౌండ్‌లో ప్రొటోకాల్ పేరిట జరిగిన ఈ రాజకీయ క్రీడకు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడ. గెలుపుని, ట్రోఫీని అవమానించిన చోటే.. దేశ గౌరవాన్ని, సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం ద్వారా సూర్యకుమార్ తన గొప్ప మనసుని చాటుకున్నాడు.
5/6మేము సాధించిన ఈ విజయం దేశ ప్రజలందరిదీ. మనల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా, కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల త్యాగం ముందు ఈ మ్యాచ్ ఫీజు చాలా చిన్నదని.. తన వంతుగా ఈ మొత్తాన్ని భారత ఆర్మీకి, పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు సహాయం చేయడానికి ఇస్తున్నానని ప్రకటించాడు. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనలలో ఉంటారు.. జై హింద్ అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ట్రోఫీ దక్కకపోయినా, కెప్టెన్ చూపిన తెగువ, దాతృత్వం కారణంగా టీమిండియా గౌరవం రెట్టింపు అయిందని సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
6/6ప్రోటోకాల్ ప్రకారం ఏసీసీ అధ్యక్షుడు ట్రోఫీని అందించాల్సి ఉండగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పాక్ మంత్రి నుంచి స్వీకరించడం సముచితం కాదని భారత జట్టు యాజమాన్యం భావించినట్లు సమాచారం. దీంతో గెలిచిన జట్టుకు ట్రోఫీని అందించకుండానే కార్యక్రమాన్ని ముగించడం క్రికెట్ చరిత్రలోనే అపూర్వ ఘట్టంగా నిలిచిపోయింది.