Hair Care Tips : ప్రస్తుతం చాలామందికి జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్యగా మారింది. వీటికి ఆహారం, స్ట్రెస్ కన్నా కూడా మరో.. పెద్ద కారణం ఉంది అని చెబుతున్నాయి అధ్యాయనాలు. ముఖ్యంగా ఆ కారణం వల్లనే ఎంతోమందికి జుట్టు ఊడిపోతోందంట. ఇంతకీ చుట్టూ ఊడిపోవడానికి ప్రధాన కారణమైన విషయం ఏమిటంటే..
1/5జుట్టు ఊడిపోవడమనేది ప్రస్తుతం అందరికీ సహజమైన సమస్య అయిపోయింది. అందుకే మూడు పదుల వయసు వచ్చే లోపల అబ్బాయిల్లో బట్టతల కూడా వచ్చేస్తోంది. ఇక అమ్మాయిలకి పెద్ద జడ అనేది కళలాగా మారిపోతుంది.
2/5ఈ క్రమంలో జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణం ఆహారాలవాట్లు లేకపోతే స్ట్రెస్ అనే అనుకుంటూ ఉంటాం మనమందరం.
3/5కానీ ఈ రెండిటి కన్నా కూడా మరో పెద్ద కారణం జుట్టు ఊడిపోవడంలో ఎక్కువ పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నాయి అధ్యయనాలు..
4/5ఇంతకీ అదేమిటంటే.. మనం ఎక్సర్సైజులు, జిమ్ములు చేసేటప్పుడు…అలానే ఎండాకాలం బయట తిరగడం.. వల్ల ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. అయితే తలపైన చెమట పట్టడం వల్ల.. అలానే చెమట పట్టిన తర్వాత తలస్నానం చేయకపోవడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుందంట.
5/5ముఖ్యంగా చలికాలం మూడు నాలుగు రోజులకు తల స్నానం చేస్తే పర్వాలేదు కానీ.. ఎండాకాలం లేకపోతే జిమ్ చేసేవారు చెమట పట్టిన తర్వాత కూడా మూడు నాలుగు రోజులు తలస్నానం చేయకపోతే.. తద్వారా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అని చెబుతున్నాయి అధ్యయనాలు.