Swetha Nagu Dream Signs In Upcoming Life: కలలో శ్వేత నాగు కనిపిస్తే.. ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!

Wed, 11 Dec 2024-7:11 am,

చాలామందికి కలలు వివిధ రకాలుగా పడుతూ ఉంటాయి. కొంతమంది అయితే ఉదయం 6 గంటల సమయంలో పడిన కలలు నిజమవుతాయని అంటూ ఉంటారు. ఇవి ఏ కలలైనా మంచైనా చెడు అయిన పక్కా జరుగుతాయని మన పూర్వీకులు తరచుగా చెబుతూ ఉంటారు. ఇది నిజమేనా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది.   

చాలామందికి వచ్చే కలలో  ఎక్కువగా పాములు ఇతర జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి నల్లపాము కనిపిస్తే మరి కొంతమందికైతే తెలుపు రంగుతో కూడిన పాము (శ్వేత నాగు) కనిపిస్తూ ఉంటుంది. ఇలా పాములు కనిపించడం మంచిదేనా?   

జ్యోతిష్య శాస్త్రంలో, స్వప్న శాస్త్రంలో పాముల కలలకు సంబంధించి వివిధ అర్థాలు ఉన్నాయి. కలలో పాము చేసే అంశాలపై ఆధారపడి ఉంటాయని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. పాము కలలో కాటేస్తే ఒక విధంగా అర్థం వస్తే.. పాము వెంబడించడానికి మరో అర్ధాన్ని స్వప్న శాస్త్రం చెబుతుందట.   

కొంతమందికి కలలో తెల్లపాము (శ్వేత నాగు) కనిపిస్తూ ఉంటుంది. ఇలా తెల్లపాము కనిపించడం, అది వెంబడించడం, కాటేసేలా కనిపించడానికి అనేక అర్థాలు ఉన్నాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో తెల్లపాము కనిపించడం ఆశుభంగా పరిగణిస్తారు. అది మిమ్మల్ని వెంబడించేలా మీకు కనిపిస్తే అనేక సమస్యలు వస్తాయి.  

స్వప్న శాస్త్రం ప్రకారం అదే నల్ల పాము కనిపిస్తే చాలా శుభప్రదమని.. జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుందట. కాబట్టి కలలు తెల్లపాము కంటే నల్లపాము కనిపించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link