Swiggy Shares: దెబ్బకు పడిపోయిన స్విగ్గీ స్టాక్స్.. వేల కోట్లు హాంఫట్‌.. పెట్టుబడి పెట్టవచ్చా?

Swiggy Shares: దేశంలోని అతిపెద్ద ఫుడ్ డెలివరీ కంపెనీల్లో ఒక్కటైన స్విగ్గీ కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. కంపెనీ షేర్లు 2024 డిసెంబర్ లో  617 గరిష్టస్థాయి నుంచి 43శాతానికి పడిపోయాయి. 
 

1 /7

Swiggy Shares: దేశంలోని అతిపెద్ద ఫుడ్ డెలివరీ కంపెనీల్లో ఒక్కటైన స్విగ్గీ కష్టాల్లో ఉంది. కంపెనీ షేర్లు 2024 డిసెంబర్ లో 617 గరిష్ట స్థాయి నుంచి 43శాతానికి పడిపోయాయి. ఈ భారీ పతనంతో మార్కెట్ విలువలో దాదాపు రూ. 60, 000కోట్లు నష్టపోయింది.   

2 /7

ప్రస్తుతం స్విగ్గీ స్టాక్, ఐపీఓ ఇష్యూ ప్రైస్ రూ. 390 కంటే 9శాతం తక్కువగా ఉంది. స్విగ్గీ ప్రధానంగా రెండు రంగాల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఒకటి ఫుడ్ డెలివరీ బిజినెస్ కాగా మరొకటి దానికొత్త క్విక్ కామర్స్ విభాగం.   

3 /7

క్విక్ కామర్స్ లో స్విగ్గీ ఇన్ స్టామార్ట్ ద్వారా ఆల్ట్రా ఫాస్ట్ డెలివరీలను అందిస్తోంది. అయితే ఇందులో పోటీ ఎక్కువగా ఉంది. జొమాటో తీసుకువచ్చిన బ్లింకిట్, ఇతర జెప్టో, బిగ్ బాస్కెట్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కుంటుంది. భారీ డిస్కౌంట్లను అందించడం ద్వారా మార్కెట్ వాటా పొందేందుకు పోరాడుతున్నాయి. దీంతో లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్విక్ కామర్స్ లో స్విగ్గీ నష్టాలు2026 ఆర్థిక ఏడాదిలో పెరుగుతాయని2027లో మెరుగుపడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.   

4 /7

 ఒకప్పుడు ప్రాథమిక వృద్ధి ఇంజిన్‌గా ఉన్న దాని సాంప్రదాయ ఆహార పంపిణీ వ్యాపారం గత కొన్ని త్రైమాసికాలలో, ముఖ్యంగా పట్టణ మార్కెట్లలో స్థూల ఆర్డర్ విలువ (GOV) వృద్ధిలో ఒక నియంత్రణను చూసింది. త్వరిత వాణిజ్యంలో దాని ప్రతిష్టాత్మక విస్తరణ ఊహించిన దానికంటే ఖరీదైనదిగా నిరూపించబడుతున్న అధిక-స్టేక్స్ పందెం అయింది.  

5 /7

స్బిగ్గీ క్విక్ కామర్స్ విభాగం ఇన్ స్టామార్ట్ కూడా ఇబ్బందులు ఎదుర్కుంటుంది. ఇన్ స్టా మార్ట్ స్థూల వర్తకం విలువ 2 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. బ్లింకిట్, జెప్టో తర్వాత మూడో అతిపెద్ద సంస్థగా నిలిచింది. వేగవంతమైన ఎక్స్ పాన్షన్, భారీ డిస్కౌంట్ ఖర్చు లాభాలను కూడా తగ్గిస్తోంది.   

6 /7

ఈ పరిస్థితి 2026 ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కంపెనీలు ఎఫిషియంట్ ఆపరేషన్స్ నుంచి ప్రయోజనం పొందడంతో లాభాలు మెరుగుపడవచ్చు. 

7 /7

చాలా మంది ఇన్వెస్టర్లు ఇది స్వీగ్గీలో పెట్టుబడి పెట్టేందుకు మంచి సమయమా కాదా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాల్యూకొనుగోలుకు మంచి అవకాశమా లేక మరింత పతనానికి సంకేతమా అనే డైలమాలో ఉన్నారు. ఇటీవల అమ్మకాలు స్విగ్గీ స్టాక్ ను చౌకగా చేశాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు.