Tamannaah: తమన్నా బాయ్ ఫ్రెండ్ కి అరుదైన వ్యాధి.. అది తెలిసే..!

Tamannaah Boyfriend: తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఎన్నో సందర్భాలలో కలిసి కనిపించడమే కాకుండా.. తాను ఇద్దరం ప్రేమలో ఉన్నట్లు కూడా అధికారికంగా వెల్లదించిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా మాత్రం వీరిద్దరూ విడిపోయారు అన్న వార్త తెగ వినిపిస్తోంది. ఈ క్రమంలో విజయ్ వర్మ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

1 /5

తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించినప్పటి నుండి ఈ జోడీపై అభిమానుల ఆసక్తి పెరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ విరిపోయారు అన్న వార్త తెగ ప్రచారం అవుతుంది. ఈ క్రమంలో..తాజాగా విజయ్ వర్మ ఆరోగ్యంపై కొన్ని షాకింగ్ వార్తలు వెలుగులోకి వచ్చాయి.  

2 /5

విజయ్ వర్మ అరుదైన చర్మ సంబంధిత వ్యాధి అయిన విటిలిగోతో బాధపడుతున్నారని సమాచారం. ఈ వ్యాధి వల్ల చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. సామాన్యంగా ఇది ఎటువంటి ఆరోగ్య సమస్యలను కలిగించదు కానీ కొందరికి మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు.    

3 /5

విజయ్ వర్మ ఈ వ్యాధి గురించి కొద్ది రోజుల క్రితమే ఓపెన్‌గా మాట్లాడారు. తన చర్మంపై కనిపించే మార్పుల వల్ల కొన్నిసార్లు లోతుగా బాధపడతానని చెప్పారు. అయితే, ఈ సమస్యను తాను స్వీకరించానని, ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో దీనిని వెల్లడించానని తెలిపారు.  ఇక గత కొద్ది రోజుల క్రితం విజయవర్మ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు మళ్లీ తమన్నాతో బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

4 /5

తమన్నా, విజయ్ వర్మ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ జంట ప్రేమలో ఉన్నట్లు కొద్ది రోజుల క్రితమే వెల్లడించారు. అయితే, వీరి మధ్య విబేధాలు వచ్చాయని, ఇటీవల విడిపోయారని రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ వీటిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.  

5 /5

తమన్నా ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమపై ఎక్కువగా దృష్టి పెట్టింది. తెలుగులో ఆమె చివరిసారిగా ‘భోళా శంకర్’ చిత్రంలో నటించింది. త్వరలో ఒదేలా 2 లో కనిపించనుంది.