Tamannaah: తమన్నా బ్రేకప్ వెనుక ఉన్న అసలు కారణం ఇదే…విజయ్ వర్మ బాగోతానికి అభిమానులు షాక్!

Tamannaah breakup

తమన్నా గురించి సౌత్ ప్రేక్షకులకు, నార్త్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మిల్కీ బ్యూటీ అనగానే వెంటనే ఈ అమ్మడు పేరు గుర్తొస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలోని ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరోయిన్ బ్రేకప్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

1 /5

మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ తమన్నా. మొదట్లో ఈమెకు పెట్టగా పాపులారిటీ.. రాకపోయినా.. శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

2 /5

తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ ఇండస్ట్రీలలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. కాగా కొద్ది సంవత్సరాల నుంచి హిందీ సినిమాలలో అలానే వెబ్ సిరీస్ లో వరస అవకాశాలు అందుకుంటుంది. 

3 /5

ఈ క్రమంలో కొద్ది సంవత్సరాల క్రితం..హిందీ వెబ్ సిరీస్ లాస్ట్ స్టోరీస్ 2 లో తనతో పాటు రొమాన్స్ చేసిన విజయవర్మతో ప్రేమలో పడింది తమన్నా. ఇక వీరిద్దరి ప్రేమ గురించి.. వీరిద్దరే మీడియాకి సైతం చెప్పుకొచ్చారు.

4 /5

ఎన్నో ఈవెంట్స్ కి కలిసిమెలిసి వెళ్లి అందరిని ఆకట్టుకున్నాడు. విజయవర్మ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నాని ఎంసీఏ సినిమాలో విలన్గా నటించారు విజయవర్మ. అయితే ఉన్నట్టుంది వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

5 /5

ఈ వార్త తెలిసినప్పటి నుంచి అందరూ ఇంతలా కలిసి మెలిసి ఉన్న వీరిద్దరూ ఎందుకు విరిపోయారు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. తమన్నా త్వరగా పెళ్లి చేసుకోవాలని అనిందని.. కానీ విజయ్ వర్మ మాత్రం దానికి ఒప్పుకోలేదని.. అందువలనే ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులు ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లి గురించి విజయవర్మ ఆలోచిస్తున్నారన్న వార్తలు రావడంతో.. అభిమానులు ఈయన ప్రవర్తన ఏంటి ఇలా ఉంది అని షాక్ అవుతున్నారు. కాగా వీరిద్దరు బ్రేకప్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.