Add Zee Business As A Preferred Source
App

Tamannaah: చక్కనమ్మ చిక్కినా అందమే.. తమన్నా లేటెస్ట్ పిక్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Written ByTA Kiran Kumar
Published: Sep 11, 2025, 04:04 PM IST|Updated: Sep 11, 2025, 04:04 PM IST

Tamannaah: తమన్నా.. స్వతహాగా ఉత్తరాది భామ అయినా.. దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికగా సత్తా చాటింది. హీరోయిన్ గా ముందుగా   దక్షిణాదితో పాటు ఆ తర్వాత ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కథానాయికగా నటిస్తూనే ఐటెం భామగా అలరిస్తోంది. అంతేకాదు వెబ్ సిరీస్ లతో అలరిస్తోంది. 

Tamannaah1/5

తమన్నా

Tamannaah:  ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట సత్తా చాటుతోంది తమ్మూ బేబి. కథానాయికగా  20 యేళ్లు పూర్తి చేసుకున్న ఇప్పటికీ అదే సోయగంతో ఆడియన్స్ ను అలరిస్తోంది. కథానాయికగా  నటిస్తూనే అవసరమైనపుడు గ్లామర్ ఒలకబోస్తూనే ఉంది.

Tamannah First Movie 2/5

తమన్నా ఫస్ట్ మూవీ

తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. అంతకు ముందు హిందీలో 'చాంద్ సే రోషన్ చెహ్రా' చిత్రంతో  పలకరించింది. మొదటి సినిమా అంతగా అలరించలేదు. కానీ తమ్మూ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన 'హ్యాపీ డేస్' చిత్రంతో  మిల్కీ బ్యూటీ వెనుదిరిగి చూసుకోలేదు. 

Tamannaah 20 Years Industry 3/5

తమన్నా 20 ఇయర్స్ ఇండస్ట్రీ

మిల్కీ బ్యూటీ తమన్నా.. తన యాక్టింగ్  కంటే తన గ్లామర్ తోనే ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తైయింది. ఇది కూడా ఓ రికార్డు అని చెప్పాలి. ప్రెజెంట్  సింగిల్ గానే పెళ్లి కాకుండానే   లైప్ లీడ్ చేస్తోంది. ఇన్నేళ్ల కెరీర్ లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది.  

Tamannaah Marriage 4/5

తమన్నా మ్యారేజ్

ఇరవై యేళ్లుగ  సౌత్  సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అలరిస్తూన్ తమన్నా.. ఈ యేడాది  తన లవర్ విజయ్ వర్మను మ్యారేజ్  చేసుకుంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  ఆ మధ్య లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మతో  కలిసి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో తమన్నా రెచ్చిపోయి హాట్ హాట్ గా నటించి మెప్పించింది.  అప్పటి నుంచి ఎక్కువగా వీళ్లిద్దరు ప్రతి ఫంక్షన్ లో  చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.  

Bhola Shankar 5/5

భోళా శంకర్

తమన్నా సినిమాల విషయానికొస్తే.. 2023లో  చిరంజీవితో చేసిన 'భోళా శంకర్, బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.  ఈ మూవీ  తమన్నా కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అటు రజినీకాంత్ ‘జైలర్’ మూవీలో ఐటెం సాంగ్ లో అలరించింది. ఈ యేడాది ‘ఓదెల 2’ తో పాటు రెయిడ్ 2 మూవీలో ఐటెం సాంగ్ లో అలరించడం విశేషం.