Malavika Mohanan: తమిళ భామ ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. కొంత మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా రిప్లైలు ఇచ్చింది. ఇంతలో కొంత మంది దీన్ని అడ్వాంటెజ్ గా తీసుకుని అతిగా ప్రవర్తించారు. దీంతో మళవీకా మోహనన్ సీరియస్ అయ్యింది.
1/5చాలా మంది హీరోయిన్ లు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎప్పటి కప్పుడు తమ ఫోటోలు, వీడియోలను ఇన్ స్టాలలో షేర్ చేస్తుంటారు. కొంత మంది భామలు.. సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు కూడా ఇస్తుంటారు. కానీ కొంత మంది నెటిజన్ లు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నీచంగా ప్రవర్తిస్తారు.
2/5ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్లల పర్సనల్ లైఫ్ లు, వ్యక్తిగత విషయాలు కాంట్రవర్సీ అంశాలపై మాట్లాడి వారిని రెచ్చగొడుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో నిలిచాయి. తాజాగా.. తమిళ భామ మాళవికా మోహనన్ కు కూడా ఒక చేదు అనుభవం ఎదురైంది.
3/5మాళవీకా మోహనన్..తన అందం, నటనతో అభిమానుల్ని సంపాదించుకుంది. తమిళం నుంచి వచ్చినఈ భామ... ప్రస్తుతం తన డెబ్యూ తెలుగు సినిమాగా రెబల్ స్టార్ ప్రభాస్, మారుతీ కలయికలో ది రాజా సాబ్ అనే ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్లో తన సత్తా చాటాలని నటి భావిస్తుంది.ఈ క్రమంలో నటి ఇటివల తన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది.
4/5ఈ క్రమంలో కొంత మంది మాళవీక బ్యూటీ సీక్రెట్ ల గురించి, డైట్ ల గురించి అడిగారు. మరికొందరు ఆమె పెళ్లి గురించి, క్రష్ గురించి ప్రశ్నలు వేశారు. వాటిని నటి మాళవిక..నవ్వుతూ ఫన్నీగా రిప్లైలు కూడా ఇచ్చింది. కానీ ఇంతలో ఒక నెటిజన్లు.. అసలు మీరు వర్జినా.. మిమ్మల్ని పెళ్లి చేసుకొవాలని అనుకుంటున్నాను.. మీకు భర్త కావాలంటే ఎలాంటి క్వాలీటీస్ ఉండాలని తింగరి ప్రశ్నలు వేశాడు.
5/5దీంతో మాళవిక మోహనన్ ఫైర్ అయ్యారు. ఇలాగా రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేయడం మానాలని, ఈ వంకరబుద్దిని మార్చుకొవాలని చురకలు పెట్టారు. ఈ క్రమంలో సదరు నెటిజన్ తన ప్రశ్నను డిలీట్ చేశారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీద ఉందని.. పెళ్లికి సిద్దంగా లేనని మాళవీకి చెప్పుకొచ్చారు. హీరో ప్రభాస్ తో నటించడం ఇష్టమని కూడా మాళవీక మాట్లాడారు. ప్రస్తుతం నటి కామెంట్లు వైరల్గా మారాయి.