Goduma Upma: ఉదయం మనం తినే టిఫిన్ పైన.. మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అని చెబుతూ ఉంటారు వైద్య నిపుణులు. ముఖ్యంగా రోజు మొత్తం హుషారుగా ఉండాలి అంటే పొద్దున మనం తీసుకునే టిఫిన్ ఏమిటి అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. అంటే కాదు ఉదయం మనం తినే టిఫిన్ పైనే మన మెటబాలిజం డిపెండ్ అయి ఉంటుంది..
1/5మనం ఉదయాన్నే తినే టిఫిన్ పైనే.. మనం రోజు మొత్తం మన శరీరానికి అందించే శక్తి.. అలానే మెటబాలిజం డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ రెండింటికి కూడా ఎంతగానో ఉపయోగపడే టిఫిన్.. గోధుమ రవ్వ ఉప్మా.
2/5ఉదయాన్నే గోధుమ రవ్వ ఉప్మా.. తినడం వల్ల బరువు తగ్గదమే కాకుండా శరీరానికి కావలసిన విటమిన్స్ కూడా అందుతాయి.
3/5ఈ గోధుమ రవ్వ ఉప్మా టేస్ట్ గా చేసుకోవాలంటే..కావాల్సిన పదార్ధాలు గోధుమ రవ్వ: 1 cup ఎండు మిర్చి: 3 పచ్చిమిర్చి: 2 బటానీ: 1/4 cup నూనె: 2 tbsp 1 tsp ఆవాలు, మినపప్పు, శెనగపప్పు, జీలకర్ర ఉప్పు, 1 tsp నెయ్యి/నూనె 1/2 cup ఉల్లిపాయ తరుగు ఇంగువ – చిటికెడు 2 రెబ్బలు కరివేపాకు కొత్తిమీరా- కొద్దిగా
4/5ముందుగా గోధుమ రవ్వ నూనె/ నెయ్యి కరిగించి వేసుకొని.. సన్నని సెగ మీద.. రవ్వ తెల్లబడే వరకు వేపుకోవాలి. మరో బండలిలో..నూనె వేడి చేసి అందులో మినపప్పు, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువా, పచ్చిమిర్చి ఒక్కోటిగా.. వేస్తూ వేపుకోవాలి.
5/5ఆ తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా వేగాక... బటానీ వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇపుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మరుగుతున్న నీళ్లలో..వేపుకున్న రవ్వ వేసి బాగా..కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన కనీషం 15 -18 నిమిషాలు.. ఉడకనివ్వాలి. చివిరియా.. కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. అంటే టేస్టీ గోధుమ రావ ఉప్మా రెడీ.