Add Zee Business As A Preferred Source
App

Gift Ideas for Teachers: టీచర్స్ డే స్పెషల్.. మీ ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే ది బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే..!

Written ByAruna MaharajuUpdated byAruna Maharaju
Published: Sep 04, 2025, 06:27 PM IST|Updated: Sep 04, 2025, 06:27 PM IST

Teachers Day Gift Ideas 2025: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో ఈ రోజు శుక్రవారం వస్తుంది. ఈ ప్రత్యేక రోజున మన ఉపాధ్యాయులు మన జీవితాలను ఎలా మలిచారో గుర్తు చేసుకుని, వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు చిన్న బహుమతులు ఇవ్వవచ్చు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయులను సన్మానిస్తారు. తక్కువ ఖర్చుతో ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే కొన్ని బహుమతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Teachers Day Gifts1/5

మీరు మీ ఉపాధ్యాయులకు కాఫీ మగ్ బహుమతిగా ఇవ్వవచ్చు. దానిపై మంచి సందేశం లేదా ఉపాధ్యాయుల ఫోటో ప్రింట్ చేయించవచ్చు. ఈ మగ్‌ని వారు కాఫీ తాగడానికి లేదా పెన్నులు పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది వారి టేబుల్‌పై అందంగా కనిపిస్తుంది.   

Teachers Day Gifts2/5

సక్యూలెంట్ మొక్కలు కూడా గొప్ప బహుమతి. ఈ మొక్కలు నీరు లేకపోయినా ఎక్కువ రోజులు ఉంటాయి. టేబుల్‌పై లేదా ఇంట్లో పెట్టుకోవడానికి ఇవి అనువైనవి. ఈ మొక్కలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి.   

Teachers Day Gifts 20253/5

ఇంకో ఐడియా ఏమిటంటే ఉపాధ్యాయులతో మీకున్న ఫోటోలను కొలాజ్‌గా తయారు చేసి, ఫ్రేమ్‌లో పెట్టి బహుమతిగా ఇవ్వవచ్చు. దీనితో ఒక చిన్న లేఖ జోడిస్తే, అది వారికి మధురమైన జ్ఞాపకంగా మిగులుతుంది. 

Teachers Day Gift Ideas4/5

అలాగే కస్టమైజ్డ్ కీచైన్ కూడా మంచి బహుమతి. దీనిపై ఉపాధ్యాయుల పేరు లేదా వారికి నచ్చే డిజైన్ రాయించవచ్చు.  ఇది వారి రోజువారీ జీవితంలో ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చులోనే అందుబాటులో ఉంటుంది. 

Teachers Day  5/5

ఫ్లవర్ బొకే కూడా ఒక అద్భుతమైన బహుమతి. మీరు మీ చేతితో స్వయంగా తయారు చేసిన లేదా బయట షాప్ నుండి తీసుకున్న ఫ్లవర్ బొకే ఇవ్వవచ్చు. ఒకే ఒక్క గులాబీ కూడా వారి మనసును ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఈ బహుమతులు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఏ బహుమతి ఇచ్చినా, దానితో పాటు ఒక చిన్న లేఖ రాస్తే, అది ఉపాధ్యాయులకు మరింత ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగులుతుంది.