Smriti Mandhana wedding Soon: టీమిండియా క్రికెట్ క్వీన్ స్మృతి మంధాన.. త్వరలో తన ప్రియుడ్నిపెళ్లి చేసుకోబోతుంది. పలాష్ ముచ్చల్ అనే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో స్మృతి ప్రేమలో ఉన్నట్లు ఎప్పటికప్పుడూ వార్తలు బయటికొచ్చినప్పటికీ.. వీరిద్దరూ దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే ఈ లవ్‌బర్డ్స్ మాత్రం తరచుగా ఒకరితో ఒకరు దిగిన ఫోటోలను పంచుకుంటూ.. తమ రిలేషన్‌షిప్‌పై హింట్స్ ఇస్తూ వచ్చారు. తాజాగా పలాష్ ముచ్చల్.. స్మృతి ఇండోర్‌కు కోడలవుతుందని ధ్రువీకరించడంతో పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది.
1/5భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తన అందంతో, ఆటతో భారత మహిళా టీమ్‌కి విశేషమైన ఆదరణ దక్కడానికి కారణం స్మృతినే. ఆమెని చూడడానికే చాలా మంది కుర్రాళ్లు వుమెన్స్ క్రికెట్ చూడడం మొదలుపెట్టారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అలా కోట్ల మంది కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన స్మృతి మంధాన.. ఐదేళ్లుగా తన బాయ్‌ఫ్రెండ్ పలాష్ ముచ్చల్‌తో రిలేషన్‌లో ఉంది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా పలాష్ ముచ్చల్ ప్రకటించాడు.
2/5ఇండోర్ స్టేట్ ప్రెస్ క్లబ్‌లో పలాష్ మాట్లాడుతూ.. స్మృతి మంధాన త్వరలో ఇండోర్ కోడలిగా రానుంది. అదొక్కటే నేను చెప్పాలని అనుకుంటున్నానంటూ ప్రకటించాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మృతి మంధాన.. చాలా సార్లు పలాష్ ముచ్చల్‌తో కలిసి కనిపించింది. అలాగే పలాష్ కూడా టీమిండియా ఆడే చాలా మ్యాచులకు హాజరయ్యాడు.
3/5బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ అయిన పలాష్ ముచ్చల్.. కొన్ని రోజుల క్రితం #5 లవ్ అంటూ స్మృతి మంధానతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోల కింద కామెంట్స్‌లో లవ్ సింబల్స్‌ని పోస్ట్ చేసింది స్మృతి మంధాన. దీంతో వీరిద్దరూ మధ్య ఉన్న లవ్ ఆల్మోస్ట్ అందరికీ కన్ఫామ్ అయింది.
4/52014లో ‘డిష్కియాన్’ అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన పలాష్ ముచ్చల్.. దాదాపు 15 సినిమాలకు సంగీతం అందించాడు. 29 ఏళ్ల స్మృతి మంధాన, ప్రస్తుతం ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నీలో భారత జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కెప్టెన్‌గా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ కూడా అందించింది స్మృతి మంధాన.
5/5అంతేకాకుండా ఇటీవలే స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై కేవలం 66 బంతుల్లో 80 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, వన్డే క్రికెట్‌లో తన 5 వేల పరుగులు మైలురాయిని కూడా పూర్తి చేసుకుంది. క్రికెట్ మైదానంలో అద్భుతంగా రాణిస్తున్న ఈ స్టార్ ప్లేయర్.. త్వరలో వైవాహిక జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.