Add Zee Business As A Preferred Source
App

Hardik Pandya: పుట్టిన రోజు సందర్భంగా గర్ల్ ఫ్రెండ్ ఫోటో షేర్ చేసిన హార్దిక్ పాండ్య..!

Written ByRenuka Godugu
Published: Oct 11, 2025, 08:07 AM IST|Updated: Oct 11, 2025, 08:07 AM IST

Pandya Shares Girlfriend Photo: ఎన్నో రోజులుగా వస్తున్న ర్యూమర్స్‌కు క్లారిటీ ఇచ్చేశాడు టీమ్‌ ఇండియా స్టార్ ఆల్ రౌండర్. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా హార్దిక్‌ పాండ్య తన ప్రేయసిని అభిమానులకు పరిచయం చేశారు.  ఆమె ఫోటో నెట్టింటా వైరల్ అవుతుంది. మోడల్ మహిక శర్మతో రిలేషన్ లో ఉన్న వార్తలు నిజమేనని దీంతో క్లారిటీ వచ్చేసింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.. 
 

All Rounder1/5

ఆల్‌ రౌండర్

 భారత స్టార్ ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్య పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన నిన్న ముంబై ఎయిర్‌పోర్టులో మోడల్ మహీక శర్మతో జంటగా కనిపించిన వీడియో నెట్టింటా వైరల్ అయింది.  వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అయింది. దీనికి క్లారిటీ ఇచ్చారు టీమ్ ఇండియా ఆల్ రౌండర్. ఆయన ఇంస్టాగ్రామ్ స్టోరీలో మహీక చేయి పట్టుకుని నడుస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతుంది.   

Jasmin Walliah2/5

జాస్మిన్ వాలీయా

అంతకుముందు సింగర్ జాస్మిన్ వాలీయాతో రిలేషన్ ఉన్న వార్తలు కూడా నెట్టింట వైరల్ అయింది. పాండ్యా నటాషాతో విడిపోయిన తర్వాత తాజాగా మహికతో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా పుట్టినరోజు అక్టోబర్ 11 జరుపుకునేందుకు వారు వెకేషన్ కు వెళ్లారు. ఆ సందర్భంలోనే వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్ లో జంటగా కనిపించారు.   

Natasha Stankovic3/5

నటాషా స్టాంకోవిక్‌

 గతంలో సెర్బియాకు చెందిన మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను కూడా పాండ్యా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు అగస్త్య కూడా ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఏడాదికే విడిపోయారు. ఆమెతో విడాకుల తర్వాత జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని రోజులకే వారికి కూడా బ్రేకప్ అయినట్లు సమాచారం.   

Mahika Sharma4/5

 మహిక శర్మ

 మహిక శర్మతో ఒక మోడల్. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారన వార్తలు కొన్ని రోజులుగా వైరల్ అయ్యాయి. ఈరోజు హార్దిక్ పాండ్య పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వెకేషన్ కి వెళ్తున్నట్లు జంటగా కనిపించారు. దీంతో ఆయన ఇంస్టాగ్రామ్ స్టోరీలో కూడా ఆమె ఫోటో షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే క్లారిటీ వచ్చేసింది.   

hardik Pandya5/5

హార్దిక్‌ పాండ్య

హార్దిక్‌ పాండ్య పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకునేందుకు మహీకతో కలిసి ఆయన వెళ్లినట్లు తెలుస్తుంది. ఆమెతో కలిసి సముద్రం వద్ద చిల్‌ అవుతున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ స్టోరీ గా పెట్టారు. దీంతో రిలేషన్ లో ఉన్నారని అధికారికంగా ప్రకటించినట్లు అయింది.