Add Zee Business As A Preferred Source
App

Tejaswi Madivada: "బిగ్‌బాస్ వల్ల నా కెరీర్ నాశనం అయిపోయింది" టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్!

Written ByHarish Darla
Published: Sep 07, 2025, 05:54 PM IST|Updated: Sep 07, 2025, 05:54 PM IST

Tejaswi Madivada Bigg Boss: బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఆ ఇంటి నుండి వెళ్లిపోయిన చాలా మంది పోటీదారుల జీవితాలు మారిపోయాయి. కొంతమంది పోటీదారులు వరుస సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే బిగ్‌బాస్ వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని ఓ టాలీవుడ్ నటి ఆరోపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఇప్పుడే ఆ విషయం తెలుసుకోండి. 

Tejaswi Madivada comments1/6

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. బిగ్ బాస్ గేమ్ షో ఇప్పటికే సీజన్ 8ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

Tejaswi Madivada Photos2/6

దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ రియాలిటీ షోలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు, సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించిన వారు అందరూ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశిస్తారు.  

Tejaswi Madivada Movies3/6

బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు (ఆదివారం) ప్రారంభం కానుంది. తెలుగు ప్రేక్షకులు సీజన్ 9 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యలో ఒక నటి బిగ్ బాస్ షో వల్ల తన కెరీర్ నాశనం అయిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.  

Tejaswi Madivada fans4/6

తెలుగు నటి తేజస్వి మదివాడ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి ప్రేక్షకులను అలరించింది. ఈ నటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె సినిమాల్లో బిజీగా ఉంటుందని అందరూ అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.  

Actress Tejaswi Madivada5/6

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తేజస్వి బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ, "చాలా మంది బిగ్ బాస్ కి వెళ్లాలని తహతహలాడుతున్నారు. అక్కడ జరిగే సంఘటనలు మనకు ఏదో ఒకటి చూపిస్తాయి. బిగ్ బాస్ చూసే వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు.   

Tejaswi Madivada6/6

మా గురించి చెడుగా మాట్లాడుతారు. చాలా మంది నెగటివ్ కామెంట్స్ చేస్తారు. దీనివల్ల దర్శకులు, నిర్మాతలు మాకు అవకాశాలు ఇవ్వడానికి వెనుకాడతారు. బిగ్ బాస్ షో నా కెరీర్ ను నాశనం చేసిందని" తేజస్వి అన్నారు.