Telangana College Holidays 2025: తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్ ఇప్పటికే స్కూలు, ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా డిగ్రీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించేసిందే. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
తెలంగాణలో చదువుతున్న డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కాబురు అందించింది. రాష్ట్రంలోని 30 సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలకు మే నెలాఖరు వరకు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మే 1వ తేదీ నుంచి 30 వరకు సెలవులు రానున్నాయి.
అదేవిధంగా మహాత్మా గాంధీ, కాకతీయ యూనివర్సిటీలకు మే 31 వరకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఇక పాలమూరు, శాతవాహన యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులకు జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి.
ఇక తెలంగాణలో అన్ని జూనియర్ కాలేజీలకు కూడా ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మార్చి 31 తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు. జూన్ 2వ తేదీ తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయి.
అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీ నుంచి అన్ని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి జూన్ 11వ తేదీన స్కూళ్లు తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో 46 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు వచ్చాయి.
వేసవి సెలవులు అంటేనే విద్యార్థులకు ఎగిరి గంతేసే పండగ లాంటిది. ఈ నేపథ్యంలో స్కూలు, కాలేజీకి చెందిన విద్యార్థులు లాంగ్ టూర్ వేస్తారు. లేదా ఊళ్ళకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల ప్రతి ఏడాది ఈ సెలవులు వస్తాయి.