Telangana Intermediate College Holidays: విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్. ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అయితే ఇంటర్ కాలేజీలకు మాత్రం ఒక రోజు ముందుగానే సెలవులు రానున్నాయి. రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు రేపటి నుంచే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కీలక సూచనలు చేసింది. అయితే ఇంటర్ కాలేజీలకు ఒక రోజు ఎక్కువగా సెలవులు రానున్నాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
1/5ఇంటర్ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. దసరా సెలవులు పొడిగించిన ప్రభుత్వం. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు నిజానికి సెప్టెంబర్ 28వ తేదీ నుంచి సెలవులు ఉండగా.. ఒక రోజు అదనంగా దసరా సెలవులు పొడిగించింది. దీంతో రేపటి నుంచి సెలవులు రానున్నాయి.
2/5ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ముందుగా ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఆ తర్వాత ఒకరోజు ముందే ఈ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు.
3/5ఇదిలా ఉండగా ఇంటర్ కాలేజీలు 10 రోజులు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ కూడా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కూడా వినతిపత్రం అందజేశారు. దసరా అతి పెద్ద పండుగ కాబట్టి బతకమ్మ సంబరాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటారు. 9 రోజులపాటు నిర్వహించే బతుకమ్మ, దసరాకు ఇప్పటికే స్కూళ్లకు పది రోజులకు పైగా సెలవులు ఇచ్చారు.
4/5అయితే ఇంటర్ కాలేజీల్లో కూడా పది రోజులు సెలవు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కూడా దసరా సెలవులు ఒకరోజు ముందుగానే ప్రకటించారు.
5/5దీంతో ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు రానున్నాయి. అయితే స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 25 వ తేదీ సోమవారం నుంచి ఈ సెలవులు ప్రకటించారు. చాలావరకు స్కూళ్లు అక్టోబర్ 3వ తేదీ పునః ప్రారంభం కానున్నాయి.