Telangana DA Hike: తెలంగాణ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు 2 శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ నిర్ణయంతో 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ లాభం చేకూరనుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. వారికి డీఏ 2 శాతం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. పెరిగిన ఈ డీఏ కూడా జనవరి నుంచి అమల్లోకి రానుందని చెప్పారు. ఈ డీఏ పెంపుతో ఉద్యోగులు పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకూరుతుంది.
ఇక డీఏ ప్రకటనపై విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేశారు. డీఏ ప్రకటనతో 71,417 మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం పొందుతారు. పెరిగిన డీఏ జనవరి నుంచి అమల్లోకి రానుందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ రంగం దేశానికి దిక్సూచి కావాలని సూచించారు. ఇక భవిష్యత్తు సవాళ్లను కూడా ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని కూడా ఆయన అన్నారు. ఈ డీఏ ప్రకటనతో ఉద్యోగుల్లో రెట్టింపు ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేయాలని కూడా భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
ఇక విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమమే తన ప్రజా ప్రభుత్వ విధానమని డిప్యూటీ సీఎం అన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 18 మందికి కారుణ్య నియామక పత్రాలు కూడా అందజేశారు. ఇందులో 7 రెగ్యులర్, 11మంది ఆర్టిజన్లుగా నియామకాలు చేపట్టారు.
మొన్న ఖమ్మంలోని ఎలక్ట్రిక్ అంబులెన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ సిబ్బంది సమస్యలను త్వరగా పరిష్కారిచేందుకు కృషి చేస్తామని కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.