Ex CM KCR Fulfilled Of His Fan Dream Pics Goes Viral: స్వరాష్ట్ర తెలంగాణను సాధించి.. పదేళ్లు అభివృద్ధి బాట పట్టించిన తెలంగాణ తొలి సీఎ కేసీఆర్‌పై ఓ అభిమాని నిరూపమానమైన ప్రేమ చూపాడు. కొడుకు పుట్టినా పేరు పెట్టకుండా కేసీఆర్ చేతులమీదుగా నామకరణం చేయాలని భావించాడు. చివరికి అతడి కల సాకారమైంది. తన దేవుడు కేసీఆర్ తన బిడ్డకు పేరు పెట్టడంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/5తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను కోట్లాది మంది ఆరాధిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన.. అభివృద్ధి చేసిన కేసీఆర్‌పై తీరొక్క రీతిన తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఓ అభిమాని తన కొడుక్కి కేసీఆర్ పేరు పెట్టాలని కొన్ని నెలలుగా ఎదురుచూస్తుండగా చివరకు ఫలించింది. తన కుమారుడికి తన దేవుడు కేసీఆర్ నామకరణం చేయడంతో అతడు సంబరాల్లో మునిగాడు.
2/5వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామస్తుడు దొడ్ల నర్సింహులు తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌ను దైవంగా కొలుస్తున్నాడు. కేసీఆర్‌ను ఒక్కసారి కలవాలని అతడు కలలు కన్నాడు. ఇటీవల జన్మించిన తన రెండో కుమారుడికి కేసీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించుకుని బాబు పుట్టిన తొమ్మిది నెలలకు కూడా నామకరణం చేయలేదు.
3/5అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి కేసీఆర్ రావడంతో దొడ్ల నర్సింహులు ఎలాగైనా కలవాలని వచ్చాడు. మంగళవారం తన అభిమానులతో కేసీఆర్ సరదాగా గడిపారు. సుదీర్ఘ సమయం పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజల కోసం సమయం కేటాయించారు.
4/5వైకుంఠ ఏకాదశి రోజు దొడ్ల నర్సింహులు కల ఫలించింది. బాబు జన్మ నక్షత్రం ప్రకారం సుమన్ అనే పేరును కేసీఆర్ పెట్టి నామకరణం చేశారు. తొమ్మిది నెలలపాటు ఉద్యమ దంపతుల నిరీక్షణ ఫలించడంతో ఆ కుటుంబం సంబరాల్లో మునిగింది.
5/5కుటుంబంతో వచ్చిన దొడ్ల నర్సింహులు, అనిత దంపతులను గులాబీ బాస్ కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి బాలుడిని ముద్దు చేశారు. బాబును ప్రేమతో తలపై నిమిరి.. సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుని కేసీఆర్ ఆశీర్వదించారు.