Telangana Government: నిరుద్యోగులకు గ్రేట్ న్యూస్, త్వరలో 11 వేల జీపీవో పోస్టుల భర్తీ

Telangana Government: నిరుద్యోగులకు శుభవార్త. భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. తెలంగాణలో ఏకంగా 11 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Telangana Government: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇదే గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం త్వరలో రెవిన్యూ శాఖలో అత్యంత కీలకమైన 11 వేల ఖాళీల్ని భర్తీ చేయనుంది. ఆర్ధిక శాఖ ఆమోదం లభించడంతో త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. 
 

1 /4

తెలంగాణ ప్రభుత్వం గ్రామ పరిపాలనను పటిష్టం చేసేందుకు కీలక నిర్ణయ తీసుకుంది. రాష్ట్రంలోని రెవిన్యూ శాఖలో కీలకమైన 10,954 పోస్టుల్ని భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 

2 /4

రాష్ట్రంలోని రెవిన్యూ శాఖలో కీలకమైన పోస్టుల భర్తీకు ఆర్ధిక శాఖ ఆమోదం లభించింది. ఇటీవలే తెలంగాణ కేబినెట్ కూడా ఆమోదించింది. ఈ కొత్త పోస్టులు జీపీవో పేరుతో ఉంటాయి. 

3 /4

గతంలో వీఆర్వోలుగా పనిచేసిన 6 వేల మందిని నేరుగా జీపీవోలుగా నియమించనుంది తెలంగాణ ప్రభుత్వం. మరో 4 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది

4 /4

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకు సిద్ధమౌతోంది. ఇప్పటికే 61,579 పోస్టుల జాబితా సిద్ధమైంది. ఉగాది తరువాత 55 వేల పోస్టుల భర్తీకు సంబంధించి వివిధ నోటిఫికేషన్లు జారీ చేయనుంది.