Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ఇకపై వరుసగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేసుకుంటోంది. టీజీపీఎస్సీతో పాటు పలు రిక్రూట్‌మెంట్ బోర్డులు ఇదే పనిలో ఉన్నాయి. వివిధ శాఖల నుంచి ఖాళీ పోస్టుల వివరాలు సేకరిస్తున్నాయి.
1/5గ్రూప్ 1 పరీక్షలో ఎంపికైన 563 మంది అభ్యర్థులకు తాజాగా నియామక ఆదేశాలు అందాయి. అలాగే గ్రూప్ 2 సెలక్షన్ జాబితాలో 783 మంది చేరారు. వీరికి కూడా ఉద్యోగ నియామక పత్రాలు త్వరలోనే పంపనున్నారు. గ్రూప్ 3 పోస్టుల నియామకానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షెడ్యూల్ విడుదలైంది.
2/5టీజీపీఎస్సీ ఈ నెలలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆలోచిస్తోంది. ఆ తర్వాత కొత్త ఉద్యోగాల భర్తీకి సిద్ధపడుతుంది. ఈ మేరకు అగ్రికల్చర్, విద్యా శాఖల నుంచి అవసరమైన వివరాలు సేకరించింది. అంతేకాకుండా కొత్త రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్ల సమాచారాన్ని కూడా సేకరించింది.
3/5తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరులో రెండేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 25 వేల పోస్టులు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
4/5పోలీస్ శాఖలో మొత్తం 17 వేల ఖాళీలు ఉన్నాయి. గురుకులాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
5/5విద్యా, వ్యవసాయం, విద్యుత్ శాఖలు విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.