cm revanth reddy govt on liquor sales: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం మందుబాబులకు తప్పతాగేందుకు క్లబ్ లు, ఈవెంట్ల నిర్వాహకలు పాటించాల్సిన రూల్స్ పై ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు.
1/6దేశ మంతట ఎక్కడ చూసిన న్యూ ఇయర్ సంబరాలు అప్పుడు ప్రారంభమయ్యాయి. చాలా మంది ఇప్పటికే న్యూ ఇయర్ కు మందు పార్టీలను తమ వారితో కలిసి ప్లాన్ లు చేసుకున్నారు. మరోవైపు కొంత మంది దూర ప్రాంతాల్లోకి వెళ్లి లిక్కర్ పార్టీలను చేసుకుంటారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మందు బాబులకు ఉబ్బితబ్బైపోయే వార్త చెప్పింది.
2/6న్యూ ఇయర్ వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో నుంచి జారీ చేసింది. దీని ప్రకారం.. డిసెంబర్ 31న బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్‌లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతిని ఇచ్చింది. అదే విధంగా.. వైన్ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
3/6దీనితో పాటు
ఈ నెల 30, 31న ప్రత్యేక తనిఖీలుంటాయన్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పష్టం చేసింది. కొత్త సంవత్సరం వేడుకలకు మద్యం అమ్మకాలపై ప్రత్యేక ఆదేశాలు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
4/6డిసెంబరు 31 వ తేదీన బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వాళ్లకు, టూరిజం ప్రాంతాల్లో రాత్రి 1 గంటల వరకు మద్యం సేవించడానికి అనుమతిచ్చారు. దీనితో పాటు ఏ 4 షాపులు (మద్యం షాపులకు) రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చునని ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
5/6మరోవైపు రేపటి నుంచి హైదరాబాద్ లో న్యూ ఇయర్ వరకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని చెప్పారు. ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తప్పతాగి రోడ్ల మీదకు వస్తే కేసులతో పాటు జరిమానాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.
6/6రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా మద్యం అమ్మకాలపై జీవో జారీ చేయడంతో ప్రస్తుతం మందుబాబులు మాత్రం ఉబ్బితబ్బైపోతున్నారు. తాగినోడికి తాగినంత అన్న చందంలా మందుబాబులు ఇప్పటి నుంచి ప్రత్యేకంగా తమ లిక్కర్ పార్టీల కోసం ప్లాన్ లు చేసుకుంటున్నారు.