Add Zee Business As A Preferred Source
App

College Holidays: కాలేజీలకు 10 రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్‌.. ఎప్పటి వరకు అంటే..?

Written ByRenuka Godugu
Published: Sep 26, 2025, 11:12 AM IST|Updated: Sep 26, 2025, 11:12 AM IST

Inter College Dussehra Holidays 2025: తెలంగాణలో దసరా సెలవులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లతో పాటు కాలేజీలో కూడా సెలవుల ప్రకటించారు. ప్రధానంగా ఇంటర్ కాలేజీలకు 10 రోజుల సెలవులు ఇవ్వాలని తాజాగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
 

Dussehra Holidays1/5

దసరా సెలవులు 2025

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లతోపాటు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. దసరా సందర్భంగా స్కూళ్లకు ఈనెల 22వ తేదీ నుంచే స్కూళ్లు బంద్‌ ఉన్నాయి. అయితే దసరా, దీపావళి అతి పెద్ద పండుగలు కాబట్టి స్కూళ్లతో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 2 తేదీ దసరా మరుసటి రోజు స్కూలు పునః ప్రారంభం కానున్నాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది.  

College Holidays2/5

కాలేజీలకు సెలవులు

 అయితే స్కూళ్లు మాత్రమే కాకుండా తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు 2025 సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. మొత్తంగా ఇంటర్ కాలేజీలకు 8 రోజులు సెలవులు వచ్చాయి. అయితే తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ 10 రోజులు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.  

Bathukamma Celebrations3/5

బతుకమ్మ సంబరాలు

 ఈ మేరకు కమిటీ నేతలు ఇంటర్ బోర్డుకు వినతి పత్రం అందజేశారు. దసరా అతిపెద్ద పండుగ దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. దానికి ముందు రోజు బతుకమ్మ సంబరాలు కూడా తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. కాబట్టి ఈ దసరా నవరాత్రులకు మొత్తంగా 10 రోజులు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇవ్వాలని వాళ్ళు వినతి పత్రం అందజేశారు.  

School Holidyas4/5

స్కూళ్లకు సెలవులు

ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు రంగ స్కూళ్లకు పది రోజులకు పైగా సెలవులు ఇచ్చారని కూడా వారు గుర్తు చేశారు. కాగా కాలేజీలకు మాత్రం ఎల్లుండి నుంచి సెలవులు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా 10 రోజుల పాటు ఇంటర్ కాలేజీలో కూడా సెలవులు ఇవ్వాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇంటర్ కాలేజీలకు 2026 జనవరి 11 నుంచి జనవరి 18 వరకు ఉండనున్నాయి.  

Summer Holidays5/5

ఎండాకాలం సెలవులు

 ఇక 2026 ఎండాకాలం సెలవులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అకాడమిక్ ఇయర్ ప్రకారం ప్రకటించారు. 2025 నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు అర్థ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే దీనికి ముందుగానే దసరా, దీపావళి అతి పెద్ద పండుగలు కాబట్టి స్కూళ్లతో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా సెలవులు ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.