Telangana March Holidays 2025: తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్. రెండు రోజులు సెలవులు, మరో రెండు రోజులు ఆప్షనల్ హాలిడేస్ రానున్నాయి. మార్చి నెలలో ఎప్పుడు ఈ సెలవులు వస్తున్నాయి తెలుసుకుందాం.
రేపటి నుంచి తెలంగాణలో పదో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్‌లు ఉండే స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇవి కాకుండా ఇప్పటికే సీబీఎస్‌ఈ స్కూళ్లు షార్ట్ హాలిడేస్ ప్రకటించాయి. మళ్లీ కొత్త తరగతులు ప్రారంభించిన తర్వాత మళ్లీ ఎండాకాలం సెలవులు ప్రకటిస్తారు.
అయితే, వచ్చే నెల నుంచి ఎండాకాలం సెలవులు ప్రాకటించారు. ఇది కాకుండా ఈ మార్చి నెలలోనే రెండు రోజులు సెలవులు, మరో రెండు రోజులు ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి.
ఈ సెలవులు ఉద్యోగులు, విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్. హజ్రత్ అలి షహాదత్‌ను గుర్తు చేసుకుంటూ ఈ నెల 21 రేపు ఆప్షనల్ హాలిడేలో ప్రభుత్వం మార్పు చేసింది.
ప్రధానంగా రంజాన్ నెల చంద్రవంక కనిపించడం ఆలస్యం కావడంతో మార్చి 22న ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. అయితే ఈనెల 28న కూడా జుమతుల్ విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది.
ఈనేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు ప్రధానంగా మైనారిటీ సంస్థలకు సెలవు ఇవ్వచ్చు. ఇక తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31, ఏప్రిల్ 1న రెండు రోజులు సెలవులు రానున్నాయి. అంటే రంజాన్ సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు.