Add Zee Business As A Preferred Source
App

Telangana: తెలంగాణలో ఉగాది కానుక.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

Written ByRenuka Godugu
Published: Mar 06, 2025, 09:06 AM IST|Updated: Mar 06, 2025, 09:06 AM IST

Telangana QR Enabled New Ration Card: తెలంగాణ ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మార్చి 30 ఉగాది సందర్భంగా తెలుగు కొత్త సంవత్సరం రోజున క్యూ ఆర్‌ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. ఆ పూర్తి వివరాలు ఇవే..
 

QR Code Enabled Ration Card1/5

క్యూ ఆర్ కోడ్ రేషన్ కార్డు

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. మార్చి 30వ తేదీ ఉగాది సందర్భంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త కార్డుల డిజైన్ కూడా ఫైనల్ చేశారు.  

CM Revanth Reddy2/5

సీఎం రేవంత్ రెడ్డి

అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఏటీఎం సైజులో.. లైట్ బ్లూ రంగులో క్యూ ఆర్ కోడ్ తో కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటో కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌లో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఉంటాయి.  

Telangana Ration Cards3/5

తెలంగాణ రేషన్ కార్డులు

మొదటి దశలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 13 లక్షల అప్లికేషన్లను ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటి వరకు 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.. అందులో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలలో ఈ కార్డుల జారీ చేపట్టనుంది.  

New Ration Cards4/5

కొత్త రేషన్ కార్డులు

కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలంటే మీసేవ పోర్టల్‌ రూ. 50 రూపాయలు నామమాత్రపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ వద్ద ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలు కూడా కలిగి ఉండాలి.  

Application Status5/5

అప్లికేషన్ స్టేటస్

అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే తెలంగాణ సివిల్ సప్లై పోర్టల్‌ ఓపెన్ చేసి అందులో మీ అప్లికేషన్ ఐడి, మీసేవ నంబర్, ఆధార్ వివరాలు నమోదు చేయాలి. ఇక ఈ  క్యూఆర్ కోడ్ తో కూడిన రేషన్ కార్డుల వల్ల ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వదు.