Telangana: స్కూళ్లకు సెలవులు.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

Telangana School Holidays 2025: స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఈనెల 24 నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23వ తేదీ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

తెలంగాణ స్కూళ్లకు వేసవికాలం సెలవులు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 23వ తేదీకి చివరి రోజు అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో 23వ తేదీ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం స్కూల్లకు ఆదేశాలు జారీ చేసింది.  

2 /5

జూన్ 12వ తేదీన తిరిగి స్కూలు పునః ప్రారంభించాలని పేర్కొంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తాయని 24 కంటే ముందే సెలవులు ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నాయి స్కూళ్లు.  

3 /5

 ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. అయితే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవికాలం సెలవులు ఉండనున్నాయి. అంటే మొత్తంగా 46 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి.  

4 /5

 తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీలకు మార్చి 31 నుంచి జూన్ 1 వరకు సెలవులు ప్రకటించింది. వారికి తిరిగి జూన్ రెండో తేదీన పున ప్రారంభం కానున్నాయి.   

5 /5

 ఇప్పటికే స్కూల్లో ఎస్సే టు ఎగ్జామ్స్ ఒకటో క్లాస్ నుంచి 9వ తరగతి వరకు ఏప్రిల్ 19 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23వ తేదీన దానికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులు అందించాలని రాష్ట్రప్రభుత్వం స్కూల్కు ఆదేశాలు జారీ చేసింది.