Add Zee Business As A Preferred Source
App

Hyderabad Rains: హైదరాబాద్ వాసులే కాదు.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.. రాగల 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం..!!

Written ByBhoomi
Published: Sep 22, 2025, 10:42 PM IST|Updated: Sep 22, 2025, 10:42 PM IST

Hyderabad Rains: రాష్ట్రంలో మళ్లీ వర్ష బీభత్సం షురూ అయ్యింది. సోమవారం సాయంత్రం కురిసిన కుంభవ్రుష్టికి హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. ఇదిలా ఉండగా రాగల రెండు మూడు గంటల్లో హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Hyderabad Rains1/6

హైదరాబాద్ లో కుంభవృష్టి

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. సోమవారం  సాయంత్రం హైదరాబాద్ నగరంలో కురిసిన కుంభవృష్టి కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో జనజీవనం స్తంభించింది. కొద్ది గంటల వ్యవధిలోనే నగరంలోని పలు కాలనీలు, రోడ్లు నీట మునిగిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Telangana Weather Alert2/6

ఉరుములు, మెరుపులు

రాబోయే 2–3 గంటలలో  హైదరాబాద్ నగరంతో పాటు మేడ్చల్, వరంగల్, సిద్దిపేట, నల్గొండ, మెదక్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది.  కొన్ని చోట్ల గంటకు 41–61 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

Orange Alert Districts3/6

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు

మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగాం, ములుగు, వరంగల్ జిల్లాలకు ప్రత్యేకంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

 Heavy Rainfall Hyderabad4/6

జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్

మరోవైపు, రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూలు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

Telangana Monsoon 20255/6

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యవసాయం, రవాణా, విద్యుత్ రంగాలపై ఈ వర్షాల ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  

IMD Weather Forecast6/6

గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు

ప్రస్తుతం వర్షాకాలం చివరి దశలో ఉండగా ఈ తరహా కుంభవృష్టులు ఎక్కువగా చోటుచేసుకోవడం సహజమే. అయితే అధిక వర్షపాతం కారణంగా తక్కువ ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉండటంతో నగర ప్రజలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.