Telangana: భగ్గుమంటున్న భానుడు.. 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు..

Telangana Weather Update: తెలంగాణలో ఎండ తీవ్రత రోజుకు పెరిగే పోతూ ఉంది. భానుడి భగభగలు ఉక్కపోత సృష్టిస్తున్నాయి. తెలంగాణలో నేడు కనిష్ట ఉష్ణోగ్రతలు 22 కాగా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువలో వెళ్తోంది. మార్చి ప్రారంభం కంటే ముందే భానుడి భగభగలు ప్రారంభమయ్యాయి.. ఈ నేపథ్యంలో ఉక్కపోత ఎక్కువైంది.

1 /5

తెలంగాణలో పొడి వాతావరణం ఎక్కువగా ఉండటంతో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  

2 /5

ముఖ్యంగా తెలంగాణపై సూర్యుడు నిప్పుల కొలిమి చెరుగుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  

3 /5

ఒకవైపు పరీక్షలు కూడా జరుగుతున్నాయి. వేడి తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయింది. ఇక పెద్దపల్లి, సుల్తానాబాద్ జిల్లాలో కూడా 39 డిగ్రీలు దాటేసింది.  

4 /5

హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా రాబోయే రెండు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో వెళ్తాయని చెప్పింది.  

5 /5

ఈ నేపథ్యంలో వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఎండ తీవ్రత సమయంలో బయటికి రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైడ్రేషన్ నిలుపుకోవాలని నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని చెప్పింది.