Add Zee Business As A Preferred Source
App

Shobha Shetty: బిగ్‌బాస్ భామ శోభాశెట్టి సీక్రెట్‌గా పెళ్లి..! వరుడు ఎవరంటే..?

Published: Oct 30, 2025, 11:32 AM IST|Updated: Oct 30, 2025, 11:32 AM IST

Shobha Shetty Marriage Pics: తెలుగులో కార్తీకదీపం సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న నటి శోభాశెట్టి.. ఆ సీరియల్‌లో పోషించిన మోనిత పాత్రతో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో ఎంట్రీ భారీ నెగిటివిటిని మూటగట్టుకున్నారు. మోస్ట్ కాంట్రవర్శీ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామకు బిగ్‌బాస్ షో తరువాత అవకాశాలు కరువయ్యాయి. సీరియల్స్‌, సినిమాలు ఎక్కడా ఛాన్స్ రాలేదు. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. తాజాగా శోభాశెట్టి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Shobha Shetty Marriage Pics1/5

కార్తీకదీపం నటి శోభాశెట్టి

శోభాశెట్టి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాల్ వైరల్ అవుతున్నాయి. ఆమె నిజంగానే పెళ్లి చేసుకుందా..? అని నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు. తీరా నిజం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.   

Shobha Shetty2/5

శోభాశెట్టి లేటెస్ట్ పిక్స్

కార్తీక్ దీపం సీరియల్‌ నటుడు యశ్వంత్ రెడ్డితో శోభాశెట్టికి పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరు ప్రేమించుకుని.. 2024 ఏప్రిల్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.   

Shobha Shetty Pics3/5

శోభాశెట్టి వివాహం

అయితే నిశ్చితార్థం జరిగి చాలా రోజులు అయినా.. ఇప్పటివరకు వీరి పెళ్లి చేసుకోకపోవడంతో నెట్టింట ఊహగానాలు మొదలయ్యాయి. ఈ నేథ్యంలో శోభా శెట్టి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు చీరలో శోభ, పంజాలో యశ్వంత్ ఉన్న వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.   

Shobha Shetty Husband4/5

శోభాశెట్టి పెళ్లి

ఈ వీడియో గురించి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలు గోల్డ్ జ్యూవెలరీ బ్రాండ్ యాడ్ కోసం తీసినట్లు తేలింది. యాడ్‌లో భాగంగా తీసిన వీడియోను చూసి నిజంగా పెళ్లి జరిగిందా అని నెటిజన్లు అయోమయంలో పడ్డారు.   

Shobha Shetty Bigg Boss5/5

బిగ్ బాస్ శోభాశెట్టి

ఈ ఫొటోలతో శోభాశెట్టి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు. శోభా-యశ్వంత్‌ల అసలు పెళ్లిపై ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. కొంతమంది ఈ ఫోటోలు, వీడియోల కింద శుభాకాంక్షలు చెబుతున్నారు.