Add Zee Business As A Preferred Source
App

Telugu Star Hero: 45 ఏళ్ల క్రితమే కులాంతర వివాహం చేసుకున్న తెలుగు స్టార్ నటుడు.. ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు..!

Written ByVishnupriya
Published: Dec 29, 2025, 12:23 PM IST|Updated: Dec 29, 2025, 12:23 PM IST

Telugu Star Actor: 45 ఏళ్ల క్రితమే కులం, మతం అనే భేదాలు లేకుండా వివాహం చేసుకున్న ఈ తెలుగు స్టార్ నటుడు.. వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయంతోనే కాదు… సినిమారంగంలో సాధించిన విజయాలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి.. కష్టపడి ఎదిగి, నటుడిగా అపారమైన పేరు సంపాదించడమే కాకుండా, ఆర్థికంగా కూడా దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. 

Inter Caste Marriage 1/5

బ్రహ్మానందం

ప్రఖ్యాత హాస్య నటుడు బ్రహ్మానందం తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయనను చాలామంది గొప్ప కమెడియన్‌గా మాత్రమే చూస్తారు. కానీ ఆయన ఆలోచనలు..అభిప్రాయాలు ఎంతో లోతైనవి. ముఖ్యంగా కుల వ్యవస్థ..మతభేదాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా ఏళ్ల క్రితమే ఆయన ఈ అంశాలపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Telugu Comedian Brahmanandam2/5

బ్రహ్మానందం

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం..చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించిన బ్రహ్మానందం చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేవారు. ఉన్నత విద్య పూర్తిచేసి కొంతకాలం అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. తర్వాత సినిమారంగంలోకి అడుగుపెట్టి, తనదైన హాస్యంతో కోట్లాది మందిని నవ్వించారు. నటుడిగా ఎంత పేరు సంపాదించుకున్నారో వ్యక్తిగత జీవితంలో కూడా అంతే సరళంగా జీవించారు.

Brahmanandam Personal Life3/5

బ్రహ్మానందం

కుల వ్యవస్థపై బ్రహ్మానందం అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ “కులం అనే భావన మనం సృష్టించుకున్నదే” అని చెబుతుంటారు. మనిషి ముందుగా మనిషే.. తర్వాతే మిగతా గుర్తింపులు అన్నది ఆయన నమ్మకం. చదువుకునే రోజుల నుంచే కులాల గురించి మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండదట. అప్పటినుంచి ఈ ఆలోచన తనలో బలంగా నాటుకుందని ఆయన చెప్పారు.  

Brahmanandam Life Story4/5

బ్రహ్మానందం

ఇంటర్వ్యూల్లో మాట్లాడిన సందర్భాల్లో, తాను ఎన్నో సంవత్సరాల క్రితమే.. ఇప్పటికి దాదాపు 45 ఏళ్ల క్రితం..కులాంతర వివాహం చేసుకున్నానని బ్రహ్మానందం ఓపెన్‌గా చెప్పారు. అంతేకాదు.. తన ఇద్దరు కుమారుల పెళ్లిళ్లు కూడా కులాంతరమేనని వెల్లడించారు. “ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్” అనే పదం కూడా తనకు ఇష్టం లేదని..అసలు కులం ప్రస్తావన లేకుండా పెళ్లిళ్లు జరగాలని ఆయన అభిప్రాయం అని.. కులం ఒకరి నుంచి ఇంకొకరికి మారడంలో అసలు ప్రయోజనం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు.

Brahmanandam Caste5/5

బ్రహ్మానందం

కులాలే కాదు.. మతాల విషయంలో కూడా ఆయన అభిప్రాయం ఇదే. మతాంతర వివాహాలు కూడా సహజంగా జరగాలని ఆయన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రేమ, గౌరవం ఉంటే చాలు..మిగతావన్నీ అప్రయోజనమే అన్నది ఆయన మాట.