Add Zee Business As A Preferred Source
App

Soap Sharing: వామ్మో.. ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా..? మీ స్కిన్‌కి ఇది పెద్ద రిస్కే..!

Written ByAruna Maharaju
Published: Aug 01, 2025, 05:32 PM IST|Updated: Aug 01, 2025, 05:32 PM IST

Soap Sharing at Home: దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబం మొత్తానికి ఒకే సబ్బును వాడటం చాలా సాధారణం. ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుందనే చాలా మంది ఆలోచిస్తారు.. కానీ దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Same Soap For Bathing1/5

అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా

ఇంట్లో అందరూ ఇప్పటికీ ఒకే సబ్బును వాడటం అనేది ఓ నార్మల్ విషయంగానే చూస్తారు. కానీ ఇది ఆరోగ్యపరంగా ఎంత వరకు సేఫ్ అనేది ఎవరూ ఆలోచించరు. ఇలా ఇంట్లో అందరూ ఒకే సబ్బును ఉపయోగిస్తే.. స్కిన్ ఇష్యూస్, బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం చాలా అవసరం.   

Same Soap For Bathing2/5

అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా

కొంతమంది సబ్బు వాడిన తరువాత ఆ సబ్బులో ఉండే క్రిములు లేదా చర్మ ఇన్‌ఫెక్షన్లు ఇతరులకు వ్యాపించవచ్చు. సబ్బులో ఉండే తడి నురుగు బ్యాక్టీరియా పెరుగడానికి సహజంగా అనుకూలంగా ఉంటుంది.   

Same Soap For Bathing3/5

అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా

కొందరు సబ్బును వాడాక బాగా కడగకుండా వదిలేస్తారు. దీని వలన మిగతా వ్యక్తులకు ఇన్‌ఫెక్షన్లు రావడం జరుగుతుంది. సబ్బును వాడిన తరువాత బాగా కడిగి, ఆరబెట్టి వాడితే ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  అలాగే మీరు చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. తప్పకుండా వైద్యుని సలహా తీసుకొని చర్మానికి అనుకూలమైన సబ్బును ఎంచుకోండి.  

Same Soap For Bathing4/5

అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా

స్కిన్ సెన్సిటివ్‌గా ఉండే వారు లేదా స్కిన్ డిసీజెస్ ఉన్న వారు ఒకే సబ్బు వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధుల ద్వారా చాలా ఫాస్ట్‌గా ఇతరులకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.   

Same Soap For Bathing5/5

అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా

మీరు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తుంటే మరియు అందరికీ వేర్వేరు సబ్బులు వాడటం కష్టమైతే.. మీరు లిక్విడ్ బాడీ వాష్ వాడటం మంచిది. సాధారణ సబ్బు కంటే లిక్విడ్ బాడీ వాష్ పరిశుభ్రత పరంగా ఎంతో ఉత్తమంగా భావించబడుతుంది.