These Actress And Heroes Likely To Get Marriage Including Samantha And Raj Nidimoru: సినీ పరిశ్రమలో ప్రేమ జంటలు చాలా ఎక్కువ. రహాస్యంగా ప్రేమ బంధం నడుపుతున్న హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా విజయ్, రష్మికతో మరో సినీ జంటల ప్రేమ బంధం పడనుంది. వారిలో ఇంకెన్ని జంటలు ఉన్నాయో తెలుసుకుందాం.
1/6సినీ పరిశ్రమలోని వారు కూడా మనుషులే. కొత్త వారు పరిచయమైతే వారి మధ్య ప్రేమ, పెళ్లి అనే అనుబంధం ఏర్పడుతుంది. తాజాగా విజయ్, రష్మిక నిశ్చితార్థంతో మరోసారి సినీ పరిశ్రమలో సినీ జంటల ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రష్మిక, విజయ్‌లా మాదిరి మరికొంతమంది సినీ నటీనటులు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాళ్లు ఎవరో తెలుసుకుందాం.
2/6టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ జంటగా ఉన్న నాగ చైతన్య, సమంత విడాకులు పొందారు. ఇప్పుడు సమంత రెండో వివాహం చేసుకోబోతున్నదని చర్చ జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తుండడంతో వీరి మధ్య ప్రేమ, పెళ్లి కన్ఫామ్ అంటున్నారు.
3/6తమిళ సినీ పరిశ్రమలో అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ మధ్య ప్రేమ వ్యవహారం చర్చకు దారి తీసింది. వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఒక ఫొటో వైరల్ అయింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి బైసన్ అనే సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడా ప్రేమ ఉందని తెలుస్తోంది.
4/6కోలీవుడ్‌లోనే మరో స్టార్ జంటపై పుకార్లు వస్తున్నాయి. స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాగూర్ మధ్య ప్రేమ ఉందని.. పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒక పార్టీలో కలుసుకుని చాటింగ్ ప్రారంభించినట్లు ఓ వార్త బయటకు వచ్చింది. అయితే మృణాల్ ఠాగూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్ సోదరీమణులను ఫాలో అవుతుండడం వారిద్దరి మధ్య ప్రేమ ఉందనేది ప్రూఫ్‌గా చెబుతున్నారు.
5/6బాలీవుడ్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లిపై నిత్యం చర్చ జరుగుతోంది. జాన్వీ శిఖర్ బహారియాతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఉట్టి పుకార్లా? లేదా నిజమా? అనేది తెలియాల్సి ఉంది.
6/6హరి హర వీరమల్లు హీరోయిన్, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న నిధి అగర్వాల్ వ్యవహారం కూడా చర్చ జరుగుతోంది. ఒక తమిళ నటుడిని ఆమె ప్రేమిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే వీరిద్దరి మధ్య బంధం ప్రారంభమైందని.. ఇంకా పెళ్లి వరకు వెళ్లలేదని తెలుస్తోంది.