Mutual Fund Returns: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో కొన్ని స్కీములు అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయి. గత చరిత్రను బట్టి చూస్తే మంచి రాబడిని అందించినవి ఉన్నాయని తెలుసుకోవచ్చు. క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఈ కోవలోకి వస్తుంది. 2000 సంవత్సరంలో ప్రారంభం అయ్యింది. సిప్ పెట్టుబడులతో కోట్లల్లో రిటర్న్స్ అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mutual Fund Returns: డబ్బులు రెట్టింపు అవ్వాలంటే ఏం చేయాలి. సరైన పెట్టుబడి స్కీమ్ ఎంచుకుని పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అక్కడ రిస్క్ ఉన్న స్కీమ్స్ కూడా ఉంటాయి. రిస్క్ లేని పోస్టాఫీస్ స్కీమ్స్ వంటివి కూడా ఉంటాయి. రిస్క్ తో అయితే మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి అందుకోవచ్చని సూచిస్తుంటారు. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ లో నెలలవారీగా సిప్ ద్వారా ఇంకా ఎక్కువ రాబడి వస్తుందని అశిస్తారు. ఇక్కడ చిన్న మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే ఇందు కోసం సరైన ఫండ్ ఎంచుకోని పెట్టుబడి పెట్టాలి.
దీనికి చక్కటి ఉదాహరణగా నిలిచింది క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ గ్రోత్ ఫండ్. 2000 ఏప్రిల్ లో ప్రారంభమైన ఈ ఫండ్ లో నెలనెలా రూ. 10వేలు పెట్టుబడి చేసిన వారికి ఇప్పుడు రూ. 3.18 కోట్లు వచ్చాయి. అంటే స్కీమ్ ఆరంభం నుంచి ఈ ఇన్వెస్ట్ మెంట్ తో ఇలా లాభాలు వచ్చాయి. అంటే ఎన్నో రెట్ల మేర లాభం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక షార్ట్ టర్మ్ లో చూస్తే ఏడాదిలో రూ. 10వేల సిప్ తో రూ. 1.07 లక్షలు వచ్చాయి
ఇటీవల స్టాక్ మార్కెట్ల పనితీరు బాగలేనందున ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే మూడేళ్లలో చూసినట్లయితే రిటర్న్స్ చేతికి రూ. 4.24 లక్షలు వచ్చాయి. ఐదేళ్లలో రూ. 10లక్షలపైనే వచ్చాయి. 7ఏళ్లలో రూ. 18లక్షలకు పైగా రిటర్న్స్ వచ్చాయి. ఇలా స్కీమ్ ప్రారంభం నుంచి చూస్తే చేతికి రూ. 3.18కోట్లు వచ్చాయి.
మార్కెట్లో హెచ్చుతగ్గులు అనేవి సహజం. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తుంచుకుని సిప్ కొనసాగించడం మంచిది. మార్కెట్ పతనంలో తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే ఛాన్స్ సిప్ ద్వారా లభిస్తుంది. మీ రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీ పెట్టుబడులు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోండి. మీ పెట్టుబడులను పలు రంగాలకు విస్తరించడం ద్వారా రిస్క్ ను తగ్గించవచ్చు.
ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు సెబీ గుర్తింపు పొందిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది. గత రాబడులు భవిష్యత్తు రాబడులకు హామీ కాదు. కాబట్టి క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ లాంటి ఫండ్స్ మంచి రాబడిని అందించినా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను విస్మరించకూడదు.