Add Zee Business As A Preferred Source
App

Brahma Yoga Effect: ధన త్రయోదశి రోజే బ్రహ్మ యోగం.. ఈ రాశుల వారికి అఖండ కుబేర యోగం.. ఏం చేసినా డబ్బే డబ్బు!

Published: Oct 17, 2025, 11:39 AM IST|Updated: Oct 17, 2025, 11:39 AM IST

Brahma Yoga In Astrology Telugu News: అక్టోబర్ 18న ఈ ఏడాది ధన త్రయోదశి వచ్చింది. ఈ త్రయోదశి రోజున ఎంతో శక్తివంతమైన బ్రహ్మయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. 

Brahma Yoga In Astrology Latest News: ప్రతి ఏడాది దీపావళికి ముందు ధన త్రయోదశినే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భారతీయులు ధన త్రయోదశి ఒక పండగలాగా జరుపుకుంటారు.. అయితే, ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీన వచ్చింది. ఈ రోజున అందరూ కొత్త వస్తువులను కొనుగోలు చేయడమే కాకుండా అమ్మవారిని పూజిస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన ధన త్రయోదశి రోజున ఎంతో శక్తివంతమైన బ్రహ్మయోగం ఏర్పడిపోతోంది. 
 

Dhantrayodashi 20251/6

బ్రహ్మయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్రహ్మయోగం అద్భుతమైన శుభయోగంగా చెప్పుకుంటారు. ధన త్రయోదశి రోజున ఈ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారు ఊహించిన ప్రయోజనాలు పొందుతారు.  

Brahma Yoga Effect2/6

మేషరాశి 

ధన త్రయోదశి నుంచి మేష రాశి వారి పరిస్థితిలు చాలా వరకు మెరుగుపడతాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది అలాగే కొత్త ఆదాయ మార్గాలు కూడా తెచ్చుకుంటాయి.. పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల విశేషమైన ఫలితాలు కలుగుతాయి.   

Yogas In Vedic Astrology3/6

మేషరాశి 

ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వ్యక్తులు బ్రహ్మయోగ సమయంలో విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ సమయంలో ఇతరుల దగ్గర చిక్కుకుపోయిన డబ్బు కూడా సులభంగా తిరిగి వస్తుంది. అలాగే పెద్ద పెద్ద పనులు చేసే సమయంలో ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దీని వల్ల ఈ సమయంలో కొంత వరకు లాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

Dhan Yogas In Astrology4/6

కన్య రాశి 

కన్య రాశి వారికి కూడా బ్రహ్మయోగం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.. ముఖ్యంగా వీరికి భౌతిక ఆనందం విపరీతంగా పెరగడమే కాకుండా శాంతితో పాటు సంతోషం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే కొత్త ఇళ్లతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం చాలా వరకు మధురంగా ఉంటుంది. 

Brahma Yoga In Telugu5/6

తులారాశి 

తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆర్థికమైన పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అలాగే వృత్తిపరమైన విజయాలు కూడా సాధిస్తారు. ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.. సంపాదన విపరీతంగా పెరుగుతుంది కొత్త కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన ప్రణాళికలతో ముందుకెళ్తారు.   

Wealth Yoga In Astrology6/6

ధనస్సు రాశి 

ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఎన్నో ఆకస్మిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలపరంగా చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే కొన్ని పనుల్లో సాధ్యమైనంతవరకు కష్టపడి.. అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా అనుకుంటున్న పనుల్లో భారీ మొత్తంలో డబ్బులు కూడా సంపాదిస్తారు.