Diabetes Symptoms: రాత్రి వేళ ఈ లక్షణాలు తరచూ కన్పిస్తుంటే బీ అలర్ట్ , మధుమేహం ప్రమాదంలో ఉన్నట్టే

ఇటీవలి కాలంలో డయాబెటిస్ ప్రధాన సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా చాలామంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. సకాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించలేకపోతే గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు తలెత్తుతాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కన్పించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు

Diabetes Symptoms: ఇటీవలి కాలంలో డయాబెటిస్ ప్రధాన సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా చాలామంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. సకాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించలేకపోతే గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు తలెత్తుతాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కన్పించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు
 

1 /4

దాహం వేయడం రోజూ పడుకొనేటప్పుడు రాత్రి నిద్రలో పదే పదే దాహం వేస్తుంటే మధుమేహం వ్యాధి కావచ్చు. ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు శరీరంలో నీటి కొరత ఉంటుంది. అందుకే గొంతు ఎండుతుంటుంది. దాహం వేస్తుంది. 

2 /4

పదే పదే మూత్రానికి వెళ్లడం రాత్రి వేళ పదే పదే మూత్రం వస్తుంటే అది మధుమేహం సంకేతం కావచ్చు. రాత్రి వేళ ఎవరికైనా ఈ పరిస్థితి ఉంటే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే కిడ్నీలు యూరిన్ ద్వారా శరీరం నుంచి బయటకు పంపిస్తుంటాయి. 

3 /4

రాత్రిళ్లు చెమట్లు పట్టడం రాత్రి సమయంలో ఫ్యాన్ తిరుగుతున్నా లేక ఏసీ ఉన్నా చెమట్లు పడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. డయాబెటిస్ లక్షణం కావచ్చు. రాత్రిళ్లు చెమట్లు పడుతుంటే వెంటనే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి

4 /4

కాళ్లు చేతుల్లో జలదరింపు చాలామందికి రాత్రిళ్లు చేతులు లేదా కాళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉంటుంది. ఈ సమస్య డయాబెటిస్ లక్షణం కావచ్చు. వెంటనే వైద్యుని సంప్రదించాలి