Snakes: పొరపాటున కూడా వీటిని ఇంట్లో ఉంచుకోవద్దు.. పాములకు గ్రీన్ కార్పెట్ వేసి ఇంటికి పిల్చినట్లే...!.

Venomous Snakes: ఇంట్లో చాలా మంది పాములను చూసి భయపడిపోతుంటారు. అయితే.. ఇంటి చుట్టుపక్కల ఉంటే పదార్థాలు లేదా మొక్కలు పాములను ఆకర్శిస్తాయి. దీని వల్ల పాములు మన ఇంటికి వస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. కొన్నిజాగ్రత్తలు పాటించడం ద్వారా పాముల్ని ఇంటి నుంచి దూరంగా తరిమేయవచ్చు.

1 /6

సాధారణంగా చాలా మంది పాములంటేనే భయంతో వణికిపోతారు. పాములు చాలా విషపూరీతంగా ఉంటాయి. ఎక్కడైతే దట్టమైన చెట్లు, చెత్త, చెదారం ఉంటుందో అక్కడ ఎలుకలు ఉంటాయి. ఆ ఎలుకల్ని తినేందుకు పాములు అక్కడకి వస్తుంటాయి.  

2 /6

పంటపోలాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో కూడా పాములు కన్పిస్తుంటాయి. పాములు కొన్నిపదార్థాలు లేదా మొక్కలచేత బాగా ఆకర్శించపడుతాయంట. అందుకే ఇళ్లలో వీటిని అస్సలు ఉండనీయకూడదని చెబుతారు. ఒక వేళ ఉంచుకున్న కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.  

3 /6

పాములు ముందుగా సువాసనను వెదజల్లే మొక్కలను ఆనుకుని ఉంటాయం.చాలా మంది ఇళ్లో మల్లెపువ్వు, ముద్ద మల్లెపువ్వు, పారిజాతం చెట్లను పెంచుకుంటారు. ఇవి పాముల్ని బాగా ఆకర్శిస్తాయి. దీని వల్ల పాములు వీటి కింద ఆవాసం చేసుకుని నివసిస్తాయి. ఈ చెట్ల నుంచి వచ్చే వాసనను ఆపాములు ఎంజాయ్ చేస్తాయి.  

4 /6

అందువల్లనే పాములు ఉండకూడదంటూ ఇంటి చుట్టుపక్కల, వరాండాలో ఇలాంటి చెట్లను పెంచకూడదని చెబుతుంటారు. అంతేకాకుండా.. ఒక వేళ చెట్లను పెంచిన కూడా.. చెట్లను ఎప్పటికప్పుడు నీట్ గా చెత్తను పేరుకుని పోకుండా జాగ్రత్తగా చూసుకొవాలి. అదేవిధంగా ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి.  

5 /6

అదే విధంగా బియ్యం గింజలు, వడ్లను ఎక్కువగా ఇంట్లో కింద పడిపోకుండా.. జాగ్రత్తగా చూసుకొవాలి. వీటిని తినేందుకు ఎలుకలువస్తాయి. ఎలుకల కోసం .. పాములు వస్తాయి. అంతే కాకుండా.. మొగలి చెట్టును కూడా.. ఇంట్లో పెంచుకోకూడదని చెబుతుంటారు. పాములు మొగలిచెట్టు కింద ఎక్కువగా నివసిస్తాయి.

6 /6

దీని వల్ల వచ్చే సువాసనల వల్ల పాములు అదేదో గాలం వేసి లాగినట్లు మీ ఇంటి వైపుకు ఆకర్శించబడతాయి. అందుకే వీడిని మీ ఇంట్లో అసలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి చుట్టుపక్కల ఎల్లప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే పాముల బెడద నుంచి బైటపడొచ్చు.