Money Blunders: డబ్బులు వృథా చేస్తున్నారా? ఈ 10 తప్పులు మీ పర్స్‌ను ఖాళీ చేస్తుంది

These Top 10 Blunders Lose Your Money: ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే భవిష్యత్‌ భరోసాగా ఉంటుంది. కానీ డబ్బుల విషయంలో తప్పిదాలు చేస్తే పీకల్లోతు కష్టాల్లోకి పడుతారు. డబ్బుల విషయంలో ఈ 10 తప్పులు చేస్తే డబ్బు వృథా అవడమే కాకుండా కష్టాలు కోరి తెచ్చుకుంటారు. ఏ తప్పులో తెలుసుకుందాం.

1 /10

జీతం, ఆదాయం కర్పూరంలా కరిగిపోతుంటే ఈ జాగ్రత్తలు.. ఈ తప్పులు చేయరాదు. సాధారణ, రోజువారీ ఆర్థిక తప్పులు చేస్తే డబ్బును కోల్పోతారు. ఆర్థిక పరిస్థితులను నియంత్రించడం, పొదుపులను పెంచుకోవడం ద్వారా బ్యాంకులో నగదు భద్రంగా ఉంటుంది.

2 /10

ఖర్చులను ట్రాకింగ్‌: మీ ఆదాయం లేదా డబ్బు ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలి. చూసి ఖర్చు చేయాలి. స్నాక్స్, రైడ్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ల వంటి చిన్న రోజువారీ ఖర్చులు తెలియకుండానే డబ్బులు అయిపోతుంటాయి. వారం పాటు ఖర్చులను నిశితంగా పరిశీలిస్తే ఎక్కడ వృథా చేస్తున్నారో అర్థమవుతుంది.

3 /10

క్రెడిట్ కార్డులు: అవసరానికి క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ అవి అంతే ప్రమాదకరం. క్రెడిట్‌ కార్డులపై ఎక్కువగా ఖర్చు చేయడంతో అధిక వడ్డీ వస్తుంది. క్రెడిట్‌ బిల్లులో కనీస మొత్తాన్ని చెల్లిస్తే వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. మీ ఆదాయాన్ని కరిగిస్తుంది.

4 /10

అత్యవసర పొదుపు: వైద్య బిల్లులు, ప్రమాదాలు, శుభకార్యాలు వంటి ఊహించని ఖర్చులు భారంగా మారుతాయి. దీనికోసం అత్యవసర నిధిని ప్రత్యేకంగా భద్రపరచుకోవాలి. అంటే అత్యవసర ఖర్చులకు పొదుపు ఎక్కడైనా చేయాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోకుండా అత్యవసర పొదుపును ఉంచాలి.

5 /10

నెలవారీ బడ్జెట్‌ ప్రణాళిక: ప్రణాళికగా మీ ఆదాయం లేదా జీతం ఖర్చు చేయాలి. తెలియకుండా ఖర్చు చేస్తుంటే ఆదాయం కరిగిపోతుంది. ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారనేది తెలుసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సి ఉంది. దీంతో మీ ఖర్చులు మీకు తెలుస్తాయి.

6 /10

జీవనశైలి మెరుగుదల: ఖర్చుల విషయంలో ఆచితూచి ఉండాలి. ఏది అవసరమో ఒకటికీ రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. కొత్త వస్తువులు కొనడం.. టూర్లు, విందు, వినోదాలు, షాపింగ్‌లు వంటివి అవసరమైతేనే చేయాల్సి ఉంది. వీటి వలన డబ్బు త్వరగా ఖర్చవుతుంది. కొనుగోలు చేసే ముందు పది నిమిషాలు ఆలోచించాలి. ఇప్పుడు అవసరమా? అని ఆలోచిస్తే వృథా ఖర్చులు ఆగుతాయి.

7 /10

రహాస్య ఛార్జీల విస్మరణ: ఆదాయం, జీతంలో తెలియకుండా కొన్ని చెల్లింపులు అవుతుంటాయి. బ్యాంకులు, క్రెడిట్‌ కార్డుల్లో తెలియకుండా వివిధ పేర్ల రూపంలో డబ్బులు ఖర్చవుతుంటాయి. ఏటీఎం ఫీజులు, ఆలస్య చెల్లింపులు, జరిమానాలు, నిర్వహణ ఛార్జీలు, అనవసరమైన యాడ్-ఆన్ సేవలు డబ్బును తెలియకుండా ఖర్చవుతాయి. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా చూస్తూ ఉండాలి. అనవసరమైనవి ఉంటే తొలగించుకోవాలి.

8 /10

ధరలు గమనించాలి: ఖర్చు చేసే ముందు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ఆ వస్తువుకు ఇతర వస్తువులకు ధర పోల్చి చూడాలి. ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ కొనుగోలు చేయాలి. ధరలు తెలుసుకోకుండా ఖర్చు చేస్తే మోసపోవడమే కాకుండా ఎక్కువ డబ్బులు చెల్లిస్తారు.

9 /10

అనవసర ఖర్చులు: మాల్స్‌ ఆఫర్లు మన ఖర్చులను పెంచుతాయి. వాటికి ఆకర్షితులై అవసరం లేకుండా ఖర్చు చేస్తారు. ఫ్లాష్ సేల్స్, ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి పేర్లతో కొనుగోలు చేస్తే అనవసరమైన ఖర్చులు వస్తాయి. ఒకవేళ అవి కొనకపోతే మీ వద్ద ఆ డబ్బు పొదుపుగా ఉంటుంది.

10 /10

పెట్టుబడులు ఆలస్యం: పొదుపును పెంచుకోవాలంటే పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడి పెట్టడానికి ఆలోచించరాదు. ఎంత ఎక్కువ.. సుదీర్ఘ కాలం పెట్టుబడి చేస్తే ఆస్థాయిలో ఆదాయం ఎక్కువ వస్తుంది. చీటీలు.. ఇతర పెట్టుబడులు పెట్టాలి.